Asianet News TeluguAsianet News Telugu

ఇనుప ముక్కల జోలికి వెళ్లొద్దు బ్రదర్.. ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన సలహానే నా కుటుంబాన్ని కాపాడింది

విశాఖ పట్నంలో లోక్ నాయక్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్యతిథి, ఏఎన్నార్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Megastar Chiranjeevi about NTR advice to save money dtr
Author
First Published Jan 20, 2024, 5:09 PM IST | Last Updated Jan 20, 2024, 5:09 PM IST

విశాఖ పట్నంలో లోక్ నాయక్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్యతిథి, ఏఎన్నార్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరితో కలసి నటించారు. 

వారిద్దరితో చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. ఈ కారక్రమంలో చిరంజీవి ఇద్దరినీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఇచ్చిన సలహా తన కుటుంబాన్ని కాపాడింది అని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. 

ఒక సమయంలో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు.. ఎన్టీఆర్ నన్ను పిలిచి.. రండి బ్రదర్ కూర్చోండి. మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు. మీ సంపాదనని ఇనుప ముక్కల కోసం వృధా చేసుకోవద్దు. మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాలు తీసుకోండి అని ఎన్టీఆర్ సలహా ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. స్టార్ డం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మన సంపాదనని దాచిపెట్టుకోవాలి అని ఎన్టీఆర్ చెప్పినట్లు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 

ఎన్టీఆర్ చెప్పే వరకు తనకు కార్లు అంటే బాగా ఇష్టం ఉండేది అని చిరు అన్నారు. మార్కెట్ లోకి కొత్త కారు వస్తే ఎలాంటి కారు కొనాలి అని ఆలోచించే వాడిని. ఎన్టీఆర్ చెప్పిన తర్వాత ఆయన సలహా పాటించా. ఆ సలహాని నన్ను, నా కుటుంబాన్ని కాపాడింది అని చిరంజీవి అన్నారు. ఎంతో అనుభవంతో, దూర దృష్టితో ఎన్టీఆర్ తనకి ఆ మాట చెప్పినట్లు చిరు అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇంకా అనేక విషయాలు పంచుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios