కన్నడలో మంచి క్రేజ్ ఉన్న హీరో కిచ్చా సుదీప్. తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఈగ, బాహుబలి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం సుదీప్ తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం హీరోగా మాత్రమే కాదు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సుదీప్ సిద్ధంగా ఉంటాడు. 

సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా తాను సిద్ధం అని సుదీప్ మరోమారు నిరూపించాడు. ప్రస్తుతం సుదీప్ 'పహిల్వాన్' అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలయింది. ఫస్ట్ లోక్ పోస్టర్ లో సుదీప్ లుక్ కేక పెట్టించే విధంగా ఉంది. ఈ చిత్రంలో సుదీప్ బాక్సర్ గా నటిస్తున్నాడు. కండలు తిరిగిన బాడీతో పవర్ ఫుల్ గా ఉన్న సుదీప్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రం కోసం చాలారోజులు కష్టపడిన సుదీప్ తన బాడీని ఇలా మార్చుకున్నాడు. సుదీప్ మేకోవర్ కు చిరంజీవి సైతం ఫిదా అయ్యారు. సుదీప్ పహిల్వాన్ చిత్రం కోసం ఎంతో అంకితభావంతో పనిచేసినట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం సుదీప్ ఎంతలా కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోగలను. పహిల్వాన్ లుక్ చాలా బావుంది. తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం బాగా చేరువవుతుందని నమ్ముతున్నట్లు చిరంజీవి తెలిపారు.