గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక బల్క్ బస్టర్, ఒక డిజాస్టర్ వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో చిరు ఫ్యాన్స్ ని ఖుషి చేయగా.. భోళా శంకర్ తో నిరాశపరిచారు. అయితే చిరంజీవి 156 మూవీపైనే అందరి దృష్టి పడింది.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక బల్క్ బస్టర్, ఒక డిజాస్టర్ వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో చిరు ఫ్యాన్స్ ని ఖుషి చేయగా.. భోళా శంకర్ తో నిరాశపరిచారు. అయితే చిరంజీవి 156 మూవీపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే బింబిసార లాంటి జానపద చిత్రంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి మూవీ చాలా రోజుల క్రితమే ఖరారయింది.
యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జానపద చిత్రంతో మ్యాజిక్ చేసిన వశిష్ఠ చిరంజీవితో కూడా అదే తరహా చిత్రాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనితో అభిమానులంతా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మించేలా ఉండాలని అంచనాలు పెట్టుకున్నారు. మెగా 156 అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
నేడు సంక్రాంతి కానుకగా మెగా ఫ్యాన్స్ కి డైరెక్టర్ వశిష్ఠ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మెగా 156 మూవీ టైటిల్ రివీల్ చేస్తూ కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ముందు నుంచి వినిపిస్తున్న విశ్వంభర అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. అదే విధంగా మూవీ రిలీజ్ డేట్ కూడా ఖరారయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కలుద్దాం అని అనౌన్స్ చేశారు. ఇక కాన్సెప్ట్ వీడియో విషయానికి వస్తే.. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ లో అదిరిపోయింది అనే చెప్పాలి.
సినిమాపై అమాంతం ఆసక్తిని పెంచే విధంగా ఈ కాన్సెప్ట్ వీడియో ఉంది. కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే విశ్వం చుట్టి వచ్చే కథలా అనిపిస్తోంది. ఒకశక్తిని ఒవెల్ షేప్ లో ఉన్న బాక్స్ లో భద్రపరిచి ఒక ఋషి లాంటి వ్యక్తి దానిని విశ్వంలోకి విసిరి వేస్తారు. ఆ పెట్టె విశ్వం మొత్తం ప్రయాణించి భూమిపైకి చేరుకుంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ పెట్టె చెక్కు చెదరరు. చివరకు భూమిపైకి వచ్చి ఆ పెట్టె ఓపెన్ అవుతుంది. అప్పుడే విశ్వంభర అనే టైటిల్ పడుతుంది.

ఈ వీడియోలో చిరంజీవి సెంటిమెంట్ అయిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపించారు. గ్రాఫిక్స్ విజువల్స్ మాత్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. కాన్సెప్ట్ టీజరే ఇలా ఉంటే.. ఇక సినిమాలో వశిష్ఠ ఎలాంటి విజువల్స్ చూపిస్తారో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.
