నట విశ్వరూపం, నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు ‘ఎన్టీఆర్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీయార్’. ఆయన తనయుడు, సినీనటుడు బాలకృష్ణ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, కృష్ణ పాత్రలో మహేష్ బాబు,  శ్రీదేవి పాత్రలో రకుల్ లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా తెలిసిన మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర కూడా ఉందట.

ఎన్టీఆర్-చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి' సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్' బయోపిక్‌లో చిరు పాత్ర ఉంటుందనే వార్తలు జోరందుకున్నాయి.అయితే చిరంజీవి పాత్ర ఉంటుందనే విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆయన పాత్ర ఎవరు పోషిస్తారనేది కూడా ఆసక్తికరమే. మరి దీనిపై దర్శకుడు క్రిష్ ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు.