మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రానున్న సినిమా సైరా.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో సరికొత్త యాక్షన్ సీన్స్ కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ మేకింగ్ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. 

అయితే సినిమా యాక్షన్ సీన్స్ లో 60 ఏళ్ల మెగాస్టార్ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించారని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే మెగాస్టార్ కూడా ప్రతి సీన్ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ నటించినట్లు చెప్పారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో హార్స్ రైడింగ్ పై యుద్ధ సన్నివేశాలు తన సొంతంగా చేసినవే అంటూ.. డూప్ లేకుండా నటించినట్లు చెప్పారు. 

ఈ వయసులో మెగాస్టార్ హార్స్ రైడింగ్ అదరగొట్టారు అంటే ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి బిగ్ స్క్రీన్ పై ఆ సీన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు.