మెగాబ్రాండ్ కూడా వర్కవుట్ కావడం లేదే..

megabrand not helping happy wedding movie
Highlights

వెబ్ సిరీస్ గా మొదలుపెట్టిన ఆమె 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాగా టర్న్ తీసుకుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ లేదనే చెప్పాలి.

మెగాడాటర్ నీహారిక రెండేళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అరంగేట్రంలో చాలా విమర్శలు ఎదుర్కొంది. మెగాభిమానులు ఆమెను హీరోయిన్ గా వొద్దని నాగబాబుని వారించారు కూడా.. కానీ నీహారిక మాత్రం 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో అమ్మడు రెండేళ్ల పాటు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కూతురు హీరోయిన్ గా పరిచయమైతే ఎలాంటి సమస్య ఉండదు. హీరోయిన్ గా వారికి ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇస్తారు. కానీ టాలీవుడ్ లో పరిస్థితి వేరు. ఇక్కడి హీరోలు కూడా వారితో నటించడానికి సందేహిస్తారు. ఈ క్రమంలో నీహారిక కూడా రెండో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంది. వెబ్ సిరీస్ గా మొదలుపెట్టిన ఆమె 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాగా టర్న్ తీసుకుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ లేదనే చెప్పాలి.

ప్రీరిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వచ్చినా.. మిగిలిన మెగాహీరోలు సోషల్ మీడియాలో సినిమాకు సపోర్ట్ చేస్తున్నా.. సినిమాకు కావాల్సినంత బజ్ మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నారు. 'సాక్ష్యం' సినిమా కూడా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుండడంతో 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాను పట్టించుకునేవారు పెద్దగా కనిపించడం లేదు. కనీసం మెగాబ్రాండ్ కూడా ఈ సినిమాకు వర్కవుట్ కావడం లేదని ఇన్సైడ్ వర్గాల టాక్. మరి సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!
 

loader