మెగా వారసుని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వారసున్నివ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ అయితే అదో 20 ఏళ్ల ప్రాజెక్ట్ అని.. ఇంకా ప్లాన్ చేయలేదని అంటున్న ఉపాసన
మెగాస్టార్ కోడలుగానేకాక మరొక వైపు అపోలో సంస్థ నిర్వహణా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఉపాసన కామినేని కేవలం చరణ్ భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... రామ్ చరణ్ వ్యక్తిగత విషయాలు మొదలు అనేక ఆసక్తికరమైన పర్సనల్ విషయాలపై ఉపాసన తన అభిప్రాయాలను వెల్లడించింది.
తనకు చరణ్ కు పెళ్లి అయి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో చాలామంది తనను పిల్లలను ఎప్పుడు కంటావు అని ప్రశ్నిస్తున్న విషయాల గురించి ప్రస్తావిస్తూ పిల్లలు అనేది 20 ఏళ్ల ప్రాజక్ట్ అని పిల్లలను చాల శ్రద్ధగా పెంచవలసిన అవసరం ఉంది అని అంటూ తాము ఇంకా తమ పిల్లల గురించి సిద్ధం కాలేదు అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. అయితే సమయం వచ్చినప్పుడు ఆ ముచ్చట తీరుతుందని ఈ విషయమై తనకు కాని తన భర్త చరణ్ కు కాని ఎటువంటి ఖంగారు లేదు అంటూ తన మనసులోని అభిప్రాయాలను బయట పెట్టింది ఉపాసన.
ఇదే సందర్భంలో ఆమె చరణ్ గురించి మాట్లాడుతూ తాను చరణ్ కి పెద్ద ఫ్యాన్ అని అంటూ ప్రతి చిన్న విషయంలోనూ తనకు ఎంతో ప్రాముఖ్యత చరణ్ ఇస్తాడు అన్న విషయాన్ని బయట పెట్టింది. తన అపోలో ఫ్యామిలీలో 75 వేలమంది ఉద్యోగులు ఉన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ వారంతా తన కుటుంబ సభ్యులే అంటోంది ఉపాసన.
ఇదే సందర్భంలో ఆమె తన ఫిజికల్ ఫిట్ నెస్ సీక్రెట్ గురించి చెపుతూ తాను నాన్ విజ్ బిర్యాని తింటే తాను మరుసటి రోజు 14 గంటలపాటు ఏమి తినకుండా ఉపవాసం ఉంటానని అదేవిధంగా తాను చరణ్ ఆహారపు అలవాట్లు పై కూడ ఒక కన్నేసి ఉంటానని అంటూ చరణ్ ఫిజికల్ ఫిట్ నేస గురించి తాను తీసుకునే జాగ్రత్తలు వివరించింది. మన శరీరం అనేది విలువ కట్టలేని విలువైన వస్తువు అని అయితే చాలామంది తమ శరీరం యొక్క విలువను తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి అని అంటోంది ఉపాసన.
