ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రతిభని చాటుకున్నాడు. మిగిలిన హీరోలతో పోలిస్తే వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. నిఖిల్ నటించిన తాజా చిత్రం 'అర్జున్ సురవరం'.

మే 1న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్  రావడంతో పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇప్పటికీ నిఖిల్ పలు టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

అలానే ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్ మధుకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. దీంతో మెగాస్టార్ ని ఈ ఈవెంట్ కి అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు 'సై రా' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. 

అయినప్పటికీ కాస్త సమయం తీసుకొని ఈ ఈవెంట్ కి రావాలనుకుంటున్నారట. ఆయన వెసులుబాటుని బట్టి ప్రీరిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.