మెగా అభిమానులకు పుట్టిన రోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ ఘనంగా అభిమానుల మధ్య చిరంజీవి 62వ పుట్టినరోజు వేడుకలు బర్త్ డే వేడుకల సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల ఇక మెగా స్టార్ కు అపురూపమైన గిఫ్ట్ ఇచ్చిన మెగా సోదరి విజయదుర్గ

తన పుట్టినరోజు కానుకగా మెగా అభిమానుల మధ్య చిరంజీవి 151 చిత్రం "సైరా నరసింహారెడ్డి" ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు జరిపారు మెగా తనయుడు రామ్ చరణ్. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా సైరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ సైరా... చిరు ఫస్ట్ లుక్ ను రాజమౌళితో లాంచ్ చేయించి మెగాస్టార్ కు గిఫ్ట్ గా ఇచ్చారు,

ఇక మెగాస్టార్ చిరంజీవి తన 62వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఈ వేడుకలలో చిరంజీవికి అతడి అభిమానుల దగ్గర నుండి కుటుంబ సభ్యుల వరకు ఎన్నో గిఫ్ట్స్ వచ్చాయి. అయితే ఈ గిఫ్ట్స్ అన్నింటిలోకి సాయి ధరమ్ తేజ్ తల్లి చిరంజీవి చెల్లెలు విజయదుర్గ అందించిన గిఫ్ట్ ప్రస్తుతం మెగా అభిమానుల మధ్య షాకింగ్ న్యూస్ గా మారింది. 

చిరంజీవి నిన్న జరిగిన ‘సైరా’ మోషన్ పోష్టర్ ఫంక్షన్ కు కూడ వెళ్ళకుండా తన ఇంటికే పరిమితం అయిపోవడంతో చిరంజీవి సన్నిహితుల దగ్గర నుంచి అభిమానుల వరకు అందరూ మెగా కాంపౌండ్ బాట పట్టారు. అయితే అక్కడ చిరంజీవి చెల్లెలు విజయ దుర్గ ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద కత్తి తయారుచేయించి తన అన్నకు ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

చిరంజీవి 'సైరా' సినిమాలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ గా కనిపించబోతున్న నేపధ్యంలో ‘ఉయ్యాలవాడ’ వీర ఖడ్గాన్ని పోలిన కత్తిని అమృతసర్ లో ప్రత్యేకంగా తయారు చేయించి తన అన్న చిరంజీవికి గిఫ్ట్ గా ఇచ్చింది. 

ఈ కత్తిని ఆమె కుమారులు సాయిధరమ్ తేజ్ - వైష్ణవ్ తేజ్ లతో కలిసి చిరంజీవికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. చిరంజీవి ఆ కత్తిని చేతపట్టి కెమెరాలకు ఫోజులు ఇస్తుంటే వారి ఆనందానికి అవదులు లేవని చెప్పాలి. 

సామాన్యంగా ఇలాంటి కత్తులు విల్లంభులు టాప్ హీరోల అభిమానులు వారు నటించిన సినిమాల విజయోత్సవ ఫంక్షన్స్ లో ఇస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా చిరంజీవి చెల్లెలు తన అన్న కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈకత్తి ఇవ్వడానికి సంబంధించిన ఫోటోలు నేటిరోజున సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి..