గోపిచంద్ నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. గతంలో రావు రమేష్ ఇంట్లో భోజనం చేస్తుండగా వంటకాలను శ్రీదేవితో ఎలా పోల్చేవారో తెలిపాడు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ - గోపిచంద్ కాంబినేషనల్ లో పక్కాగా హిట్ కొట్టేందుకు వస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే ప్రముక నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజ్ కూడా హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు.
చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి వేదికపై మాట్లాడుతూ.. రావు రమేశ్ ను కలవటం గానీ, సినిమాల్లో నటించడం కుదరలేదు. రావు గోపాల్ నాకు చిన్న మావయ్యగారు అంటాను. మేం ఇద్దరం లంచ్ టైంలో కలిసినప్పుడు రావు రమేశ్ గారి తల్లి స్వయంగా చేసిన వంటకాలను నాతో తినిపించే వారు. ఈ క్రమంలో వంకాయ కూరనూ పంపించారు. దాన్ని తినకుండా వదిలేయడంతో.. అయ్యాయో ఎందుకలా వదిలేస్తున్నారు. ఆ వంకాయను చూస్తే శ్రీదేవి బుగ్గల్లా కనిపించట్లేదా.. కుర్రాడివి కొరుక్కు తినమంటూ ప్రోత్సహించే వారని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇక రావు గోపాల్ లేకపోయినా.. ఆయన స్థానాన్ని రావు రమేశ్ భర్తీ చేస్తున్నారని తెలిపారు. త్వరలో తనతోనూ రావు రమేశ్ పనిచేయాలని కోరాడు. తండ్రి, కొడుకుల ఇద్దరీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుందన్నారు. మున్ముందు మరిన్ని చిత్రాల్లో విభిన్న కథల్లో నటించాలని ఆకాంక్షించారు.
గోపీచంద్(Gopichand) ఇటీవల `సీటీమార్` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్ `పక్కా కమర్షియల్`(pakka Commercial)లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna), పలు కీలక పాత్రల్లో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించారు. జూలై 1న రిలీజ్ కానున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కుతుంది.
