అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయ్యారు. ఈ కలయిక సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయ్యారు. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన చరణ్ తన తండ్రితో కలిసి అమిత్ షాను కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటోన్న సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదిలావుండగా.. ఇండియా టుడే కాన్ క్లేవ్ (India Today Enclave) ఈవెంట్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని మోడీతో ఆయన వేదికను పంచుకున్నారు.
అంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ ను సాధించిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి, కాలభైరవ అండ్ టీమ్ ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే నగరంలో అడుగుపెట్టారు. తారక్ కు ఎయిర్ పోర్టులోనే ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ పలికిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల తారక్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే చరణ్ మరో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో పాల్గొనాల్సి రావడంతో ఆయన హైదరాబాద్ రాకుండా నేరుగా ఢిల్లీలో దిగారు.