అల్లు మెడికల్ కాలేజీకి కోటి రూపాయలు "చిరు" సాయం

First Published 21, Feb 2018, 2:12 AM IST
mega star chiranjeevi allocates fund for allu college
Highlights
  • అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజీకి చిరంజీవి నిధులు
  • ఎంపీ లాడ్స్ నుంచి కోటి రూపాయలు కేటాయించిన చిరు
  • చిరును అభినందించిన రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్

టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ ఎంపీ డా.చిరంజీవి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీ కొత్త భవనం నిర్మాణం కోసం కోటి రూపాయల నిధులను చిరంజీవి అందించారు. ఆ కాలేజీలో కొత్త భవనం నిర్మించేందుకుగానూ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలను చిరు మంజూరు చేశారు. చిరు నిధుల మంజూరుపై రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి స్వగృహంలో ఆయనను కలిసి మురళీ మోహన్ పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు చెప్పారు. 


చిరంజీవితో నటుడు, తెదెపా ఎంపీ మురళీ మోహన్ కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. 'మనవూరి పాండవులు' - 'గ్యాంగ్ లీడర్' వంటి హిట్ సినిమాలలో వీరు కలిసి నటించారు. రాజకీయాలపరంగా ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారైనా, సినీరంగానికి సంబంధించి ఇరువురికి మంచి అనుబంధం వుంది.

 

ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన గుండు హనుమంతరావు చికిత్స నిమిత్తం కూడా చిరు రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. చికిత్స జరుగుతున్న సందర్భంలో గుండు హనుమంతరావు అకాల మరణం పొందటంపై చిరు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

loader