Asianet News TeluguAsianet News Telugu

పేరు చెప్పను కానీ అంటూ పరశురామ్ మీద అరవింద్ సెటైర్, గట్టిగానే

నేను పేరు చెప్పను కానీ ఇంకో దర్శకుడికి కూడా ఆఫర్ ఇచ్చాను, లేట్ అయింది కానీ అతను వెళ్ళిపోయాడు. చందు మాత్రం ఇప్పటికీ అదే మాట మీద నిలబడి మా నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు అని అన్నారు.

Mega producer #AlluAravind satire on Director Parasuram
Author
First Published Jun 1, 2023, 2:57 PM IST

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (AlluAravind)కు ఇంకా దర్శకుడు పరుశరామ్ మీద కోపం పోయినట్లు లేదు. ఆ విషయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు మరోసారి బయిటకు వచ్చింది. మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ '2018'ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లతో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా థాంక్యూ మీట్ ని నిర్వహించగా, దీనికి అల్లు అరవింద్, చందు మొండేటి హాజరయ్యారు.

రీసెంట్ గా తమ బ్యానర్ ద్వారా రిలీజైన  #2018Movie సినిమా సక్సెస్ గురించి, అది ఎందుకు అందరూ చూడాల్సిందో అని వివరించడానికి ఈరోజు మీడియా వాళ్ళతో మాట్లాడేరు.  అదే సమయం లో పక్కనే వున్న దర్శకుడు చందు మొండేటి (ChanduMondeti) గురించి చెపుతూ, చందూ మొండేటి మూడు సినిమాలు తమ గీత ఆర్ట్స్ (GeethaArts) లో చేస్తున్నాడని చెప్పారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను నిర్మాతగా ఉంటూనే బన్నీవాసు లాంటి వాళ్ళని మరింతమందిని ఎంకరేజ్ చేస్తున్నాను. సినీ పరిశ్రమలో సీనియర్స్, మా జనరేషన్ జూనియర్స్ కి స్పేస్ ఇవ్వాలి. మొత్తం మేమే అనుకోకూడదు సీనియర్స్. డబ్బులు, పేరు మొత్తం మాకే అనుకోకూడదు. జూనియర్స్ కి స్పేస్ ఇస్తే పరిశ్రమ ఇంకా బాగుంటుంది. కొత్తవాళ్లను తొక్కేయకూడదు, సపోర్ట్ ఇవ్వాలి అని అన్నారు.

అలాగే.. చందు మొండేటితో గతంలోనే సినిమా అనుకున్నాం. కార్తికేయ 2 హిట్ అయిన తర్వాత కాదు, దానికంటే ముందే ఆయనతో సినిమా అనుకున్నాం. త్వరలో మా నిర్మాణంలో సినిమా ఉంటుంది. నేను పేరు చెప్పను కానీ ఇంకో దర్శకుడికి కూడా ఆఫర్ ఇచ్చాను, లేట్ అయింది కానీ అతను వెళ్ళిపోయాడు. చందు మాత్రం ఇప్పటికీ అదే మాట మీద నిలబడి మా నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు అని అన్నారు.

'కార్తికేయ 2' #Karthikeya2 విడుదల కాకముందే చందు మొండేటి గొప్ప దర్శకుడు అని గుర్తించి అతనికి మా గీత ఆర్ట్స్ లో సినిమా చెయ్యమని చెప్పడం జరిగిందని చెప్పారు అల్లు అరవింద్. అతని సినిమా విడుదల అయి సుమారు ఒక సంవత్సరం అవుతోందని, అదీ కాకుండా ఈమధ్య కాలంలో చందుకు చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయని, అయినా కూడా అతను నాకు ఇచ్చిన కమిట్మెంట్ వలన, వేరే సినిమాలు చెయ్యకుండా, నాకు చేశాకే వేరే సినిమా చేస్తా అన్నాడు. ఈమధ్య కొందరు ఆలా నాకు కమిట్మెంట్ ఇచ్చి గీత దాటి వెళ్లారు, వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు, అని ఇండైరక్ట్ గా దర్శకుడు పరశురామ్ (ParasuramPetla) ను ఉద్దేశించి అన్నారని అర్దమైపోయింది. ఎందుకంటే అక్కడ పరశురామ్ పేరు చెప్పకపోయినా అర్థం అయిపోతుంది.

గీతా గోవిదం వంటి సూపర్ హిట్ తర్వాత ఇంకో సినిమాపరశురామ్ గీత ఆర్ట్స్ కి సినిమా చేయాల్సి ఉంది. సర్కారు వారి పాట తర్వాత చేస్తారనుకున్నారు. అయితే పరుశరామ్ ఊహించని విధంగా  మరో పెద్ద నిర్మాత దిల్ రాజు కి సినిమా చేస్తాను అని వొప్పుకొని అధికారికంగా ప్రకటించాడు కదా.  దాంతో అల్లు అరవింద్ చాలా సీరియస్ అయి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అని అనగానే, అతన్ని పరిశ్రమలో కొంతమంది పెద్దలు సర్ది చెప్పి సరిపెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే, ఆ పరశురామ్ చేసిన పనిని పరోక్షంగా ఇలా వ్యంగ్యంగా అన్నారన్నమాట.

 చందు మొండేటి  మాట్లాడుతూ... తన తదుపరి మూడు సినిమాలు అల్లు అరవింద్ గారి నిర్మాణంలోనే ఉంటాయని చెప్పారు. రామ్ చరణ్, నాగ చైతన్య, హృతిక్ రోషన్, సూర్య వంటి హీరోల కోసం కథలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అరవింద్ గారు ఎవరితో ముందు సినిమా చేయమంటే, వారితో ఉంటుందని చందు చెప్పుకొచ్చారు.

అల్లు అరవింద్ సైతం చందు మొండేటి గీతా ఆర్ట్స్ లో మూడు చేయనున్నాడని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు కథలు లాక్ అయ్యాయని, అందులో ఒకటి రూ.200-300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios