వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9 వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9 వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థం జరిగి నెలరోజులు దాటింగి. కానీ ఇంతవరకు పెళ్లి డేట్ ఇంకా బయటకి రాలేదు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా లేదా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో మెగా అభిమానులు నిహారిక విడాకుల న్యూస్ తో కాస్త నిరాశకి గురయ్యారు. నిహారిక విడాకుల వ్యవహారం పక్కకి వెళ్ళాక వరుణ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయాలనుకున్నారో ఏమో కానీ తాజాగా గుడ్ న్యూస్ వినిపిస్తోంది. వరుణ్, లావణ్య పెళ్ళికి డేట్, వెన్యూ రెండూ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది మెగా కాంపౌండ్ నుంచి అధికారికంగా వచ్చిన న్యూస్ కాదు.
ఫిలిం వర్గాల్లో బలంగా జరుగుతున్న ప్రచారం ఇది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఆగష్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతున్నట్లు టాక్. మెగా అల్లు కుటుంబ సభ్యులు ఇతర క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లి వేడుకకి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ చిత్రంతోనే అట. మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు తెలుస్తోంది. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానీయలేదు.
తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి కూడా జరగాలని వరుణ్, లావణ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి పెట్టింది పేరు. చాలా మంది సెలెబ్రిటీలు ఇటలీలో వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే ఆగష్టు 25న వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున చిత్రం రిలీజ్ కానుంది. పెళ్లి 24న జరిగితే వరుణ్ ఈ చిత్ర ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండే అవకాశం చాలా తక్కువ. ఏది ఏమైనా పూర్తి క్లారిటీ రావాలంటే మెగా ఫ్యామిలీ స్పందించాలి.