మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున' ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున' ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. వరుణ్ తేజ్ చివరగా నటించిన గని, ఎఫ్3 చిత్రాలు నిరాశపరిచాయి.
దీనితో వరుణ్ తేజ్ గాడిలో పడాలంటే గాండీవధారి అర్జున చిత్రం విజయం తప్పనిసరి. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్ గా మలిచారు. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరో నాలుగు రోజుల్లో గాండీవధారి విజృంభణ థియేటర్స్ లో ఉండబోతోంది.
అయితే గాండీవధారి బడ్జెట్ లెక్క మాత్రం షాకిచ్చే విధంగా ఉంది. ఈ చిత్రానికి తుది బడ్జెట్ లెక్క 55 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు కెరీర్ లో కానీ.. వరుణ్ తేజ్ కెరీర్ లో కానీ ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన చిత్రం లేదు. వరుణ్ తేజ్ కి ఎఫ్ 2 ఉన్నప్పటికీ అది మల్టీస్టారర్ మూవీ. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో నిర్మాతకి 26 కోట్ల వరకు దక్కినట్లు తెలుస్తోంది.
ఇక మరో ముప్పై కోట్లు థియేట్రికల్ బిజినెస్ లో రావాలి. అంటే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ తప్పనిసరి. అప్పుడు మాత్రమే రూ 30 కోట్ల షేర్ సాధ్యం అవుతుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో అలరించే కంటెంట్ ఈ చిత్రం లో ఉందా లేదా అనేది ఆగష్టు 25న తేలనుంది. మొత్తంగా వరుణ్ తేజ్ కి ఇది కష్టమైన టాస్క్ అని అంటున్నారు. వరుణ్ కి జోడిగా ఈ చిత్రంలో సాక్షి వైద్య నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అనిపిస్తోంది. నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
