ఖైదీ నెంబర్ 150తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తిరిగొచ్చిన చిరంజీవికి అదే గ్రేసు, అదే ఊపు ఇచ్చారు మెగా అభిమానులు. ఎంపీ సుబ్బరామిరెడ్డి ఖైదీ నెంబర్ 150 సక్సెస్ సందర్భంగా మెగాస్టార్ ను పార్క్ హయత్ లో సన్మానించారు. ఈ సందర్భంగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో కలిపి సినిమాను ఎనౌన్స్ చేశాడు సుబ్బరామిరెడ్డి. అయితే ఈ ప్రపోజల్ పై మెగా అభిమానులంతా ఆశలు పెట్టుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అన్నయ్యతో కష్టమే అనడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి.

మెగా ఫ్యామిలీ అభిమానులు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలకు దూరం అయిన తర్వాత ఈ విషయం మరుగున పడిపోయింది. తాజాగా సుబ్బిరామిరెడ్డి ప్రకటన చేసినప్పటి నుండి.... మెగా అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది.

 అయితే అమెరికా పర్యటన సందర్భంగా... మీ అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నారా అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... నా దగ్గరకు అలాంటి ప్రస్తావన గానీ, ప్రపోజల్ కానీ ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ అలా అనడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి.

అటు అన్నయ్య సినిమాల్లోకి మళ్లీ వచ్చి బిజీబిజీ అయ్యారు. ఇటు తమ్ముడు రాజకీయాల్లో బిజీ బిజీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి చేయడం కష్టమే. అయితే సుబ్బరామిరెడ్డి ప్రకటన కొత్త ఉత్సాసం నింపితే... పవన్ కమెంట్స్ మెగా అభిమానుల్లో మళ్లీ నిరాశ మిగులుస్తున్నాయి.