ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్‌లు ప్రయాణాలతో బిజీగా ఉండే తారలకు కాస్త ఫ్రీ టైం దొరకటంతో ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ఓ ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. తన క్యూట్‌ మేనకోడళ్లు ఇంట్లో చేసే పనులను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

కరోనా కారణంగా ప్రజలు బయట నుంచి ఇంటికి తీసుకువచ్చిన ప్రతీ వస్తువును సానిటైజ్‌ చేసి మరీ ఇంట్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ ఇంటి తీసుకువచ్చిన కూరగాయలు చిన్నారులు క్లీన్ చేసిన వీడియోను షేర్ చేశాడు చెర్రీ. మెగా పవర్‌ స్టార్ మేనకొడళ్లు అంతా కూరగాయలను ముందుగా సబ్బు నీటితో కడిగి తరువాత మంచి నీటితో కడిగి ఆరబెట్టారు.

కురగాయలు ఇక్కడ ఎందుకు పెట్టారు ఏం చేస్తున్నారు అని రామ్ చరణ్‌ ప్రశ్నించగా చిన్నారు ముద్దు ముద్దు మాటలతో వివరించారు. జెమ్స్‌ రాకుండా ఉండేందుకు ఇలా క్లీన్ చేసి ఆరబెట్టాం అని వివరించారు చిన్నారులు. చరణ్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.