Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల ప్రచారంలో మెగా పవర్ స్టార్, వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఫోటోస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నాడు. ప్రచారానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. భారీ కటౌట్లు... భహిరంగ సభకు ప్లేస్ కూడా రెడీ చేసుకున్నాడు. ఇంతకీ ఇదంత ఏంటి అనుకుంటున్నారా..?
 

Mega Power Star Ram Charan Rc15 Updates
Author
First Published Dec 24, 2022, 11:21 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎలక్షన్స్ ను ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రచారంలో బీజీగా మారిపోయాడు. పంచ పై కండువా వేసుకుని ప్రచారానికి బయలదేరాడు. అదేంటి ఇప్పుడు అసలు ఎన్నికలే లేవు కదా.. ఉన్నా.. చరణ్ అఫీషియల్ గా ఏ పార్టీలో లేడు కదా అని.. డౌట్ వచ్చి ఉంటుంది కదా.. ? అయితే ఈ ఎన్నికల ప్రచారం రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. రామ్ చరణ్.. తన 15వ సినిమా సౌత్ స్టార్ డైరెక్టర్  శంకర్ తోచేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. 

ఇక ఈ సినిమా న్యూ షెడ్యూల్ షూటింగ్  రాజమండ్రిలో జరుగుతోంది. గోదావరి తీరంలో ప్రకృతి అందాల నడుమ.. పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.ఈ మూవీకి సబంధించిన కీలక ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారట టీమ్. ఈ  సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ ఇక్కడ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా రామ్ చరణ్ గెటప్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అంతే కాదు ఈ షెడ్యూల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్  షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు మెగా పవర్ స్టార్. అందులో భాగంగా  ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్  ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకు సబంధించి పంచె, పైజామాతో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. అంతే కాదు  ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ కి ఓటు వేయాలని జనాలను రిక్వెస్ట్ చేసే సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్  డిసెంబర్ 25వరకు జరగనున్నట్టు సమాచారం. 

రాయ్ చరణ్ పోషిస్తున్న రెండు పాత్రల్లో.. ఒక పాత్ర ముఖ్యమంత్రి అయితే మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు రామ్ చరణ్. ఇక ఈ సినిమా  సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఒకింత కోపంగా కూడా ఉన్నారు. దాంతో  కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇవ్వాలని చూస్తున్నారట టీమ్. అప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకూ..వరుసగా అప్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  

ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. ఆతరువాత ఆచార్య సినిమాతో డీలా పడ్డాడు. ఇక ఈసారి ఎలాగానే  శంకర్ సినిమాతో సాలిడ్  హిట్టు కొట్టాలని చూస్తున్నారు.  దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో స్టార్ ప్రోడ్యూసర్  దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios