క్రేజీ అభిమాని చేసిన పనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మురిసిపోయాడు. తన అభిమాని ఇచ్చిన మెమోరబుల్ గిఫ్ట్ కు ఎంతో సంతోషపడ్డాడు. తన కష్టార్జితంతో రామ్ చరణ్ కోసం  అతను తెచ్చిన బహుమతిని జాగ్రత్తగా బద్రపరుచుకున్నాడు మెగా పవర్ స్టార్.  

మెగా ఫ్యామిలీకి ఎలాంటి అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరోల డైహార్ట్ ఫ్యాన్స్ ఎన్నో రకాలు గా తమ ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల కోసం అభిమానులు ఎన్నో సాహసాలు చేశారు. తమ ప్రేమను చాటుకుని ఆ స్టార్స్ మనసుదోచారు. 

ఆ మధ్య వరకూ.. చిరంజీవి,రామ్ చరణ్ ల కోసం చాలా మంది ప్యాన్స్ కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి తమ అభిమాన తారలను కలుసుకుని ఆనందపడ్డారు. అయితే తమ అభిమానులెవరూ ఇలాంటి సాహసాలు చేయవద్దని. ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేయొద్దంటూ పలుమార్లు మెగా హీరోలు ప్రకటించారు. అయితే ఇంకా కొత్తగా తమ తారలపై ప్రేమను చాటుకునే కార్యక్రమాలు చేస్తున్నారు అభిమానులు 

అభిమాన హీరో కోసం కొందరు జనాలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రామ్ చరణ్ విషయంలో అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా వ్యక్తి. తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని బియ్యపు గింజలతో ఇలా చాటుకున్నాడు. 

Scroll to load tweet…

అంతేకాదు.. ఆ బొమ్మలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ ను చేరాడు. చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. అంతే కాదు తాను పండించిన వాటిలో రెండు బస్తాల బియ్యాన్ని రామ్ చరణ్ కు బహుమతిగా ఇచ్చిన ప్రేమను చాటుకున్నాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు.

చరణ్ కు ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తరువాత ఆయన ఫ్యాలోయింగ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. శంకర్ సినిమా షూటింగ్ కోసం అమృత్ సర్ వెళ్తే.. చరణ్ ను వదిలిపెట్టలేదు అభిమానులు. హై కేడర్ లో ఉన్న పోలీస్ లు సైతం చరణ్ కోసం ఎగబడి మరీ ఫోటోలు తీయించుకున్నారు. ఆర్మీ సైతం చరణ్ ను సత్కరించారు. మరికొంత మంది చరణ్ అల్లూరి గెటప్ ను టాటూగా వేసుకుని పిచ్చి ప్రేమను చాటుకున్నారు.