మెగా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. తాను సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇద్దాం అనుకున్నట్టు వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన అభిమానుల హార్ట్ లు బ్రేక్ అవ్వకుండా ఉంటాయా..? మరి చరణ్ ఎందుకు ఇలా చెప్పాడంటే..?
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఎన్నో అవార్డ్స్ సాధిస్తోంది. ఆస్కార్ కు అడుగు దూరంలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ పర్ఫామెన్స్ గురించి అవతార్ దర్శకుడే ప్రశంసలతో ముంచెత్తాడంటే.. చరణ్ ఏ స్థాయికి ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాదు ఆస్కార్ తరువాత ఆస్కార్ అంతటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను సాధించింది ఆర్ఆర్ఆర్ టీమ్. చరణ్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.. అటువంటిది రామ్ చరణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇద్దాం అనుకున్నాడట. అయితే మెగా ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఆర్ఆర్ఆర్ కంటే ముందు. ఇక అసలు విషయం ఏంటీ అంటే..?
అమెరికాలో RRR అదరగొడుతుంది. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం.. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తూ.. రిలీజ్ అయిన థియేటర్స్ కి వెళ్ళి సందడి చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్. ఇక రాజమౌళి, చరణ్ వెళ్లి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు. వెరీ రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ లోని ఓ ప్రముఖ థియేటర్లో RRR సినిమా షో ను వేశారు. ఆతరువాత రామ్ చరణ్, రాజమౌళి అక్కడి ప్రేక్షకులతో సరదాగా మాట్లాడారు. అంతే కాదు ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు టీమ్. ఈ సదర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు.
చరణ్ మాట్లాడుతూ.. RRR సినిమాకు ముందు నేను కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. సినిమాల నుంచి గ్యాప్ తీసుకొని కొత్తగా ఏదైనా నేర్చుకొని మళ్ళీ మంచి కంమ్ బ్యాక్ ఇద్దాం అనుకున్నాను.దానికి తగ్గట్టు ప్లానింగ్ కూడా చేసుకున్నాను. ఇక రంగంలోకి దిగడమే అనుకున్న టైమ్ లో.. సరిగ్గా అప్పుడే రాజమౌళి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఆఫర్ వచ్చింది. అప్పుడే అనుకున్నాను రాజమౌళి కన్నా తను కొత్తగా ఏదైనా నేర్చుకునేది ఎక్కడా దొరకదు అని. అందులోను ఇంతకు ముందు నేను మగధీర సినిమా జక్కన్నతో చేశాను. అప్పుడు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక స్టూడెంట్ లా మారిపోయాను.. ఇక ఇప్పుడు కూడా RRR సినిమాకు కూడా స్టూడెంట్ లాగానే టీమ్ లో జాయిన్ అయ్యాను అన్నారు రామ్ చరణ్
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నదేదో.. సినిమా చేస్తూ.. . రాజమౌళి దగ్గర నేర్చుకోవచ్చు అని నాకు అనిపించిందతి. జక్కన్న నాకు ప్రిన్సిపాల్ లాంటి వారు. ఆయన్ని కలిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంటాను. RRR ఆఫర్ రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి బయటకు వెళ్లి నేర్చుకోవడంకంటే రాజమౌళి దగ్గర పనిచేస్తే కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు కదా అని ఈ సినిమా ఓకే చెప్పాను అన్నారు. ఇక సినిమా షూటింగ్ లో ఎంతో నేర్చుకున్నాను. రాజమౌళి కాలేజీలో నేను ఒక స్టూడెంట్ అయినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని అన్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మాటలకు మెగా ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.
