మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా హీరోలు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని వెబ్ సిరీస్ లు చేస్తూనే సినిమా అవకాశాలను దక్కించుకుంది. నిహారిక హీరోయిన్ గా చేసింది రెండు సినిమాలే. హ్యాపీ వెడ్డింగ్ - ఒక మనసు చిత్రాలు అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. 

కానీ నటనలో మాత్రం నిహారిక రాటు దేలిందని ప్రశంసలు అందాయి. పెద్ద సినిమాల్లో అవకాశాలు దొరకడం లేదు గాని వచ్చిన మంచి అవకాశాలను అమ్మడు మిస్ చేసుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీయా నటిస్తోన్న ఒక లేడి ఓరియెంటెడ్ కథలో నిహారిక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అదే విధంగా త్వరలోనే స్టార్ట్ కానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కూడా నిహారిక నటించనుంది. 

ఆ సినిమాకు సూర్యకాంత అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రణీత్ అనే నుత దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాలో రాహుల్ విజయ్ నిహారికకు జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే నిహారికకు ఇది ఒక కమర్షియల్ మూవీ అని టాక్. మరి సూర్యకాంతంగా అమ్మడు ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.