కరోనాతో టాలీవుడ్‌లో పెళ్ళి సందడి మొదలైంది. వరుసగా యంగ్‌ హీరోలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. నితిన్‌, రానా, నిఖిల్‌, నిహారిక, వివేక్‌ ఆత్రేయ వంటి వారు ఇప్పటికే మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. కొత్త పెళ్లికి సంబంధించిన విశేషాలను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నాడట. ఇంట్లో ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పాడు. 

ఆ హీరో ఎవరో కాదు సాయితేజ్‌. `సోలో బతుకే సో బెటర్‌` చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాలేజ్‌లో చదివే ఓ కుర్రాడు తన స్నేహితులకు సోలో లైఫ్‌ వల్ల లాభాలేంటని చెప్పే సినిమా ఇది. ఫ్రెష్‌గా కాలేజ్‌ నుంచి బయటకు వచ్చే వాళ్లను హీరో ఎలా ఇన్‌స్పైర్‌ చేశాడనే కథతో రూపొందింది. యూత్‌కి నచ్చే అంశాలతోపాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మేళవించి ఉన్నాయని సాయితేజ్‌ చెప్పాడు. 

అయితే త్వరలో ఆయన పెళ్ళి చేసుకోబోతున్నారట. ఇప్పటికే ఇంట్లో మ్యారేజ్‌ చేసుకునేందుకు గ్రీన్‌ ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమ్మ నుంచి ఫోర్స్ పెరగడంతో, అమ్మ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లికి ఓకే చెప్పానన్నాడు. కానీ ఇక్కడే ఓ కండీషన్‌ కూడా పెట్టాడట. ఈ ఏడాది షూటింగ్‌లు ఆగిపోవడంతో తాను కమిట్‌ అయిన సినిమాలు చాలా ఉన్నాయని, ఆ సినిమాలు పూర్తయిన తర్వాతే మ్యారేజ్‌ చేసుకుంటానని కండీషన్‌ పెట్టాడట. దీంతో ఆయన అభిమానుల ఆశలపై కాసిన్ని నీళ్లు చల్లాడని చెప్పొచ్చు.