కరోన కారణంగా సినిమా షూటింగ్‌లు పూర్తిగా ఆగిపోయాయి. ఎప్పుడూ ప్రయాణాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టార్స్‌ ఇప్పుడు ఖాళీగా ఇంటిపట్టునే ఉంటున్నారు. దీంతో అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు తారలు. ఎక్కువ మంది తమ వర్క్‌ అవుట్‌ ఫోటోస్‌ వీడియోను షేర్ చేస్తుండగా మరికొంత మంది ఇన్స్‌పైరింగ్‌, ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేస్తున్నారు.

తాజాగా మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా అలాంటి వీడియోనే షేర్ చేశాడు. ఓంత చిన్న పురుగు తన ప్రయత్నంలో ఎలా విజయం సాదించింది అనే ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. `ఈ చిన్ని ప్రాణి నుంచి కూడా ఈ రోజు మనం నేర్చుకోవాలి` అంటూ కామెంట్ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. వండర్‌ ఆఫ్‌ సైన్స్ అనే ట్విటర్‌ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోను సాయి ధరమ్‌ తేజ్‌ రీ ట్వీట్ చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ప్రతీ రోజూ పండగే సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా లాక్ డౌన్‌ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.