యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను గట్టిగా నిర్వహించింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒక్కోసినిమాతో తన పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం ఈ యంగ్ హీరో ఎంతటి స్టంట్ వేశాడో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క ప్రాంక్ వీడియోతో తన సినిమా ప్రమోషన్స్ జోరు పెంచాడు. రోడ్డుపై లక్ష్మణ్ అనే అభిమానితో చేసిన ప్రాంక్ ఘటన సినిమాను పెంచేసిందనే చెప్పాలి.
అయితే, ఎక్కువ శాతం విశ్వక్ సేన్ కే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నటుడు రాహుల్ రామక్రిష్ణ ట్వీట్ చేశారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంపై స్పందించారు. ఈ మేరకు విశ్వక్ సేన్ ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. యంగ్ హీరో విశ్వక్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఈ చిత్రానికి సంబంధించిన రష్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాలు, ఎమోషన్స్ నాకు సంబంధించినవిగా ఉన్నాయి. అదే విధంగా పాత్ర కోసం విశ్వక్ సేన్ ఇంతగా ట్రాన్స్ ఫామ్ అవ్వడం అభినందనీయం. సినిమాలో అర్జున్ అనే పాత్రనే కనిపించనుంది. చిత్ర యూనిట్ బాపినీడు, బీవీఎన్ ప్రసాద్, నటీనటులకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు.
ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ హీరోగా, రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్ గా నటించారు. సూర్యాపేట కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. 30 ఏండ్లు వచ్చినా పెళ్లి కుదిరిందంటూనే.. నయా పెళ్లి కొడుకు అవతారంలో విశ్వక్ సేన్ అలరించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం.
