మెగా హీరో వరుణ్ తేజ్ వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు.ఇక నెక్స్ట్ సినిమాతో మరికాస్త పెద్ద హిట్ అందుకోవాలని ప్రయోగాత్మక చిత్రంతో రానున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అంతరిక్షం 9000 KMPH సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 9న ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మహేష్ AMB సినిమాస్ ను వేదికగా ఎంచుకున్నారు. గచ్చిబౌలిలో ఇటీవల మొదలైన ఈ మల్టిప్లెక్స్ కు అనూహ్య స్పందన వస్తోంది. ఏషియన్ సినిమాతో కలిసి మహేష్ నిర్మించిన ఈ మల్టిప్లెక్స్ లో అంతరిక్షం మొదటి వేడుకను జరుపుకోనుంది. 

దసరా సమయంలో రిలీజ్ చేసిన అంతరిక్షం టీజర్ పాజిటివ్ టాక్ అందుకోగా ఇప్పుడు ట్రైలర్ పై అంచనాలు పెరిగాయి. వరుణ్ ఈ సినిమాలో వ్యోమగామి పాత్రలో కనిపించనున్నాడు. ఇక అదితి రావ్ హైదారి - లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దర్శకుడు క్రిష్ రాజీవ్ నిర్మించారు