మెగాస్టార్ చిన్నల్లుడు యంగ్ హీరో  కల్యాణ్ దేవ్(Kalyan Dev) ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చాలా కాలంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అని రూమర్స్ షికారు చేస్తున్న వేళ.. ఆయన సోషల్ మీడియా పోస్ట్ లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

మెగాస్టార్ చిన్నల్లుడు యంగ్ హీరో కల్యాణ్ దేవ్(Kalyan Dev) ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చాలా కాలంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అని రూమర్స్ షికారు చేస్తున్న వేళ.. ఆయన సోషల్ మీడియా పోస్ట్ లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చిన్నల్లుడు కల్యాణ్ దేవ్(Kalyan Dev). . రీసెంట్‌గా సూపర్‌ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో.. మెగా అల్లుడు అయిన తరువాతే సినిమాలు స్టార్ట్ చేశాడు. విజేత లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ హీరో.. కెరీర్ టర్న్ చేసే సినిమా కోసం చూస్తున్నాడు.

ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఈ మధ్యే తన మేకోవర్‌ లుక్‌ని షేర్‌ చేసిన కల్యాణ్‌ దేవ్‌(Kalyan Dev) దీనికి ఇంట్రెస్టింగ్ ట్యగ్ లైన్స్ ను రాశాడు. కళ్యాణ్ దేవ్ ఏం రాశాడంటే.. నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్‌. నీకు నచ్చింది నువ్వు చెయ్‌ అంటూ కొటేషన్‌ను యాడ్‌ చేశాడు.

రీసంట్ గా కళ్యాణ్ దేవ్(Kalyan Dev) పెట్టిన మరో పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో మరో పిక్ ను పంచుకున్న కళ్యాన్ దానికి ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. సముద్రపు అలల మధ్య ఉదయించిన సూర్యుడి ఫోటోను షేర్‌చేస్తూ.. ఎన్నో ఆశలతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇప్పటికే మెగా ఫ్యామిల నుంచి రకరకాల రూమర్లు వినిపిస్తున్నయి. కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) కు మెగా ఫ్యామిలీకి పడటం లేదు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ మద్య మెగా ప్యామిల ఫంక్షన్స్ లో కూడా యంగ్ హీరో కనిపించకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అటు శ్రీజా కూడా ఎప్పుడు సింగింల్ గానే కనిపిస్తుంది. వీరిద్దరు కలిసి ఈ మధ్య సందడి చేసిన సందర్భాలు లేవు. దాంతో వీరి మధ్య ఏం జరుగుతుందా అని సోషల్ మీడియా జనాలు ఇంట్రస్టింగ్ గా పరిశీలిస్తున్నారు.