మోగా హీరో కల్యాణ్ దేవ్ సినిమా బాలీవుడ్ చేరింది. రిలీజ్ కు ముందే ఈ కథపై బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ కన్ను పడింది.
మెగా(Mega) అల్లుడు, హ్యాపెనింగ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్(kalyaan Dhev), యంగ్ డైరెక్టర్ రమణ తేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా “కిన్నెరసాని”. ఈ సినిమా రిలీజ్ కు ముందే బాలీవుడ్ కు చేరింది. కిన్నెరసాని సినిమా హిందీ రీమేక్ రైట్స్ అమ్ముడయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ రామ్ తళ్లూరి నిర్మాతగా.. ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్,శుభమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ మధ్య మన టాలీవుడ్ కథలపై బాలీవుడ్ కన్నేసింది. సినిమా చిన్నదా పెద్దదా అని చూడటంలేదు కథ బాగుంటే చాలు తీసుకుంటున్నారు. రీమేక్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో తెలుగు కథలు బాలీవుడ్ లో తెరకెక్కుతున్నా. ఇప్పుడు కల్యాన్ దేవ్ కిన్నెరసాని కూడా ఆ లిస్ట్ లో చేరింది. సినిమా కథ నచ్చడంతో బాలీవుడ్ స్టార్ ప్రోడక్షన్ హౌస్ జి స్టూడియోస్ ఈమూవీ కథను తీసుకున్నట్టు తెలుస్తోంది. డీలింగ్స్ దాదాపు అయిపోయినట్టే కనిపిస్తుంది.
Also Read : BALAKRISHNA: ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞ కాదు.. బాలయ్యే చేస్తున్నారా..?
డిఫరెంట్ కథలను ఎంచుకుని మెగా మార్క్ లేకుండా.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కోసం చూస్తున్నాడు కల్యాణ్ దేవ్. అందుకే సినిమాలు కూడా సెలక్టీవ్ గా తీసుకుంటున్నాడు. మంచి కథలను సెలక్ట్ చేసుకోవడమే కాదు తన పర్ఫామెన్స్ లో కూడా వేరియేషన్ చూపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాడు కల్యాణ్. ఇక ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేసిన కల్యాణ్ తన మూడో సినిమాగా కిన్నెరసాని సెట్స్ ఎక్కించాడు. మరో రెండు కథలు సినిమాలుగా ట్రాక్ ఎక్కడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
