మెగా హీరోలందరూ కమర్షియల్ హంగులతో బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతుంటే వరుణ్ దారి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. మెగా అభిమానుల మద్దతే కాకుండా ఇతర ప్రేక్షకుల మనసులను కూడా ఈ కుర్ర హీరో చాలా ఈజీగా గెలిచేసుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ సక్సెస్ తో ఒక మార్కెట్ సెట్ చేసుకున్న వరుణ్ తేజ్ అంతరిక్షంతో అంతకంటే పెద్ద హిట్ అందుకోవాలని ఆశపడుతున్నారు. 

స్పెస్ కాన్సెప్ట్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులల్లో అంతరిక్షం సినిమా ఇప్పటికే అంచనాలను రేపింది. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్ లోని jrc కన్వెన్షన్ లో మెగా అభిమానుల మద్య వేడుకను నిర్వహించనున్నారు. ఇక పేరు చెప్పకుండా ఒక మెగా హీరో వేడుకలో భాగం కానున్నాడు అని చెబుతున్నారు. 

ఆ మెగా హీరో ఎవరు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపింది. ఆ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. క్రిష్ నిర్మించిన ఈ సినిమాకు ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించగా లావణ్య త్రిపాఠి - అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించారు. డిసెంబర్ 21న సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.