టాలీవుడ్ లో మెగా, అక్కినేని, దగ్గుబాటి, నందమూరి కుటుంబాలు చాలా పెద్దవి. ఇండస్ట్రీను ముందుకు నడిపించడంలో వీరి కృషి బాగానే ఉంది. చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణలు ఇండస్ట్రీలో తన చట్రాన్ని తిప్పారు. సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సమయంలో అందరూ కూడా సొంతంగా స్టూడియోలు కట్టుకున్నారు.

నందమూరి ఫ్యామిలీ రామకృష్ణ స్టూడియో, దగ్గుబాటి ఫ్యామిలీ రామానాయుడు స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్, ఘట్టమనేని  ఫ్యామిలీ పద్మాలయ స్టూడియోస్ ను కట్టించుకున్నారు. కానీ మెగా ఫ్యామిలీకు మాత్రం ఒక్క స్టూడియో కూడా లేకపోవడంతో ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి రెడీ అవుతున్నారని సమాచారం. నిజానికి గతంలో కూడా స్టూడియో కట్టించాలని ప్లాన్ చేశారు కానీ వర్కవుట్ కాలేదు.

కానీ ఈసారి రామ్ చరణ్ మాత్రం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో మెగా ఫ్యామిలీకు చెందిన 22 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' షూటింగ్ అక్కడే జరుగుతోంది. ఈ సినిమా కోసం అక్కడ భారీగా సెట్స్ వేశారు. ఇప్పుడు అదే స్థలంలో స్టూడియోను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మరి ఈసారైనా స్టూడియో ప్లాన్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి!