ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆహ్వానం అందించిన రామ్ చరణ్ పవన్ రావాలని కోరుకుంటున్న మెగా కుటుంబ సభ్యులు పవన్ మినహా ఇప్పటికే రెడీ అయిపోయిన మెగా హీరోస్
మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కు ముందు గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేదిక మారినా... గ్రౌండ్ సరిపోతుందో లేదోననే ఆందోళన వెంటాడుతున్నా... మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై శ్రద్ధ పెట్టారు టీం. నిర్మాత రామ్ చరణ్ సహా అంతా ఎక్కడా తగ్గకుండా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ... మెగా స్టార్ ను తిరిగి స్వాగతించేందుకు ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ హీరోలంతా హాజరవుతారని అంచనాలున్నాయి.
ఇప్పటికే మెగా క్యాంప్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు తాము మెగా ఈవెంట్ కు హాజరయ్యేందుకు షూటింగ్ వాయిదా వేసుకుంటున్నామని అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా ఎదురుచూస్తున్న ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా స్టార్ ఖైదీ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.ల అయితేస పవన్ తప్పకుండా వేడుకకు హాజరవుతాడని, అయితే పవనిజమ్ ఒంటబట్టించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లరి చేస్తారు కాబట్టే ముందుగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ సతీమణి, వదినమ్మ సురేఖ కూడా పవన్ ను స్వయంగా ఆహ్వానించారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ సన్నిహితుడొకరు మాట్లాడుతూ.. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకున్నా... మెగా హీరోలంతా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కూడా బాబాయిని కలిసి వేడుకకు రావాలని కోరిన నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకరత్న దాసరి నారాయణరావును ముఖ్య అతిధిగా పిలిచారు. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. ఇంత చేస్తున్న పవన్ అన్నయ్య ఈవెంట్ కు తప్పక వస్తారని అంచనాలున్నాయి. ఏదేమైనా చివరి నిమిషం వరకు పవన్ రాక గురించి సమాచారం లీక్ చేయొద్దని... తప్పక పవన్ వస్తారని తెలుస్తోంది. మరిఅన్నయ్య మెగాస్టార్ ఈవెంట్ కు మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ వస్తాడా రాడా అనేది సస్పెన్స్.
