Asianet News TeluguAsianet News Telugu

నీ టైమ్ మారి పెద్దోడివి అయి ఉండోచ్చు.. చిరంజీవి ఎప్పుడు అక్కడే ఉంటాడు: సంచలనంగా మారిన నాగబాబు కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవిని ఒకప్పుడు పూలు చల్లి తీసుకెళ్లిన  వ్యక్తే.. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. 

Mega Brother Nagababu sensational Comments in fans meet
Author
First Published Dec 27, 2022, 10:13 AM IST

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవిని ఒకప్పుడు పూలు చల్లి తీసుకెళ్లిన  వ్యక్తే.. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. చిరంజీవి వినయ విధేయలతో ఉన్నారని ఆయనను ఎవరైనా ఏమైనా అంటే ముందుగా రియాక్ట్ అయ్యేది అభిమానులేనని అన్నారు. చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలో అభిమానులను వారిదారిన వారిని వదిలేయకుండా వారితో మమేకమై ముందుకు వెళ్లిన ఒకేఒక వ్యక్తి చిరంజీవి అని అన్నారు. అభిమానులతో మమేకం కావాలని ఆలోచన చేసిన వ్యక్తి చిరంజీవి చెప్పారు. ఇండియాలోనే చిరంజీవి అభిమానుల అంతా శక్తివంతమైన ఆర్గనైజేషన్ ఏ నటుడికి ఉండదని అన్నారు. చిరంజీవి తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌ను, అల్లు అర్జున్‌ను, రామ్‌చరణ్‌ను కూడా అభిమానులు ఆదరించారని గుర్తుచేసుకున్నారు. 

తమ ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అందరం కలిసే ఉన్నామని చెప్పారు. తమ కుటుంబం మీద ఈగ వాలితే ఎంతకైనా వెళ్లగలిగే అభిమానులు ఉన్నారని అన్నారు. మనసుకు నచ్చక రాజకీయాల్లో నుంచి చిరంజీవి వెనక్కి వచ్చారని చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి తిరిగి సినిమాల్లోకి  వచ్చిన తర్వాత కూడా అభిమానులు అదే రకమైన  ప్రేమను చూపెట్టారని అన్నారు. చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే నమ్మకం అయితే తనకు లేదని చెప్పారు. 

ఇటీవల ఒక ప్రముఖుడు చిరంజీవిని నోటికొచ్చినట్టుగా మాట్లాడానని అప్పుడు సోదరుడిగా తాను స్పందించానని.. అంతకంటే ఎక్కువగా అభిమానులు రియాక్ట్ అయ్యారని చెప్పారు. చిరంజీవి వినయ విధేయలతో ఉన్నారని అడ్వాంటేజ్ తీసుకుని ఆయనను ఎవరైనా ఏమైనా అంటే ముందుగా రియాక్ట్ అయ్యేది అభిమానులేనని అన్నారు. తాను ఎవరిని రెచ్చగొట్టనని.. శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా తాము ఎప్పుడూ వ్యవహరించమని చెప్పారు. 

‘‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి వెళ్లినప్పుడు..  ఆయనవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులను చూశాం. నువ్వు ఎంతపెద్ద నాయకుడివి అయితే మాకేంటి.. మేము  ఏమైనా అన్నామా?. రెస్పెక్ట్ అనేది ముఖ్యం. చిన్నైనా, పెద్దైనా గౌరవించాలి. ఒకప్పుడు అదే వ్యక్తిని నువ్వు సాదారంగా ఆహ్వానించి పూలు చల్లి తీసుకెళ్లావు. నీ టైమ్ మారింది. నువ్వు పెద్దోడివి అయి ఉండోచ్చు. చిరంజీవి అల్రెడీ పెద్ద వ్యక్తి.. ఎప్పటికీ అక్కడే ఉంటాడు. నువ్వు రేపు పొద్దున దిగొచ్చు.. కానీ చిరంజీవి అక్కడే ఉంటాడు’’ అని నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే చర్చ మెగా అభిమానులతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌తో కూడా హాట్ టాపిక్‌గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios