మెగా బ్రదర్ నాగబాబు సంచల నిర్ణయం తీసుకున్నారు. కాని ఆ నిర్ణయం ఏంటో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ రోజు ఆయన సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ వైరల్ అవుతుంది. 

మెగా బ్రదర్ నాగబాబు అంటే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. దాదాపు ప్రతీ సమస్యపై తనదైన శైలీలో స్పందిస్తారు నాగబాబు. ఇక మెగా ఫ్యామిలీలో ఎవరినైనా ఏమైనా అన్నా.. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్షించినా.. సోషల్ మీడియా వేదికగా కడిగిపారేయడం అలవాటు ఆయనకు ఇక ఈ మధ్య కూడా వైసీపీ లీడర్లకు ఓ వీడియో ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

ఇక ఇప్పుడు నాగబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక పక్క సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టస్ట్ గా చేస్తూ.. మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనలో కొనసాగుతున్నారు మెగా బ్రదర్. తాజాగా ఆయన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పెట్టిన ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులో ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది.

ఇంతకీ నాగబాబు సోషల్ మీడియా పోస్ట్ లో ఎం రాసుకోచ్చారంటే.. ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు మరియు కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను. అన్నారు. 

Scroll to load tweet…

అంతే కాదు ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా, కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే.. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంద అంటూ రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం నాగబాబు పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అందరిని ఆలోచనలో పడేసింది. 

ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలు గా స్పందిస్తున్నారు. నాగబాబు రాజకీయాలకు దూరమవుతున్నాడా..? సినిమాలకు దూరమవుతున్నాడా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. జనసేనకు రిజైన్ చేస్తున్నారా..? .. అని కొందరు.. పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారుతున్నారా..? అని మరికొందరు. అసలు ఏం జరిగింది అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ సంచలనంగా మారే నాగబాబు.. మరోసారి ఈ పోస్ట్ తో హాట్ టాపిక్ అయ్యారు. త్వరలో ఏదో అనౌన్స్ చేస్తా అన్నారు. ఈసారి ఏ బాంబ్ పేలుస్తారా అని జనాలు గుసగుసలాడుకుంటుంన్నారు.