శ్రీజా.. నువ్వే నా బలం- శ్రీజ భర్త కల్యాణ్ దేవ్

mega alludu son in law kalyandev praises sreeja
Highlights

భర్త నుంచి పొగడ్తలు రావటం ఏ భార్యకైనా ఆనందమే..

మెగాస్టార్ చిరంజీవి రెండో తనయ రెండో వివాహం కల్యాణ్ దేవ్ తో జరిగిన సంగతి తెలిసిందే. వాళ్ల రెండో వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో కళ్యాణ్, శ్రీజతో పాటు నివృతి (శ్రీజ మొదటి భర్త కూతురు) కూడా ఉంది.  ‘నువ్వే నా బలం. హ్యాపీ యానివర్సరీ’ అని కళ్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు వీరి వివాహబంధానికి రెండేళ్లు పూర్తికావడంతో మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 

శ్రీజ వివాహం కళ్యాణ్ దేవ్‌తో 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, కుటంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో శ్రీజ, కళ్యాణ్‌ల రిసెప్షన్ జరిగింది. ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటారు. చిరంజీవి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో కళ్యాణ్ పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సినిమాలంటే ఆసక్తి ఉందని కళ్యాణ్.. చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన పచ్చజెండా ఊపడంతో కళ్యాణ్ హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు.
 

రాకేశ్ శశి దర్శకత్వంలో కళ్యాణ్ సినిమా చేస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ఈ ప్రేమకథా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తుంది. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

loader