పవన్ కు ఫ్లాఫ్ ఇచ్చిన డైరక్టర్ తో వైష్ణవ్ తేజ చిత్రం
ఈ దర్శకుడు ఈ మధ్యనే హిందీలో షేర్షా అనే సూపర్ హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. అందరూ ఆ సినిమాని మెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో మెగా క్యాంప్ తో ఉన్న పరిచయంతో వైష్ణవ్ తేజ్ కు స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారని వినికిడి.
మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా టాలీవుడ్ లో భాక్సాఫీస్ బ్రద్దలయ్యే రీతిలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఉప్పెన’ సినిమాతో పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. ఉప్పెన సినిమాలోని డిఫరెంట్ పాయింట్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దానికి తోడు కొత్త హీరో,హీరోయిన్లు.. ఫ్రెష్ గా అనిపించే విజువల్స్ అన్నీ ప్లస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాదు.. 100కోట్లకు పైగా వసూళ్లను కూడా సాధించింది. దాంతో వైష్ణవ్ తేజ తో సినిమా చెయ్యాలని నిర్మాతలు అంతా ఉత్సాహపడుతున్నారు. కట్టలు పట్టుకుని క్యూలు కడుతున్నారు.
అయితే ఈ సినిమా కంటే ముందే వైష్ణవ్ క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసాడు. కొండపోలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. రకుల్ ఈ మూవీలో పల్లెటూరి యువతిగా కనిపించనుంది. అలాగే ఇప్పుడు వైష్ణవ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు పవన్ కళ్యాణ్ తో పంజా అనే డిజాస్టర్ చిత్రం అందించిన విష్ణు వర్దన్ తో అని తెలుస్తోంది. ఈ దర్శకుడు ఈ మధ్యనే హిందీలో షేర్షా అనే సూపర్ హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. అందరూ ఆ సినిమాని మెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో మెగా క్యాంప్ తో ఉన్న పరిచయంతో వైష్ణవ్ తేజ్ కు స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారని వినికిడి.
ఇక షేర్షా చిత్రం కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితాధారంగా రూపొందిన చిత్రం రూపొందింది. భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో కెప్టెన్ విక్రమ్ బాత్రా ఒకరు. కార్గిల్ యుద్ధంలో అసమాన పోరాటం చేసి, శత్రుమూకలను తరిమికొట్టారు. తోటి సైనికులు ఆయన ధైర్య సాహసాలు చూసి, 'షేర్ షా' అనిపిలిచేవారు. 24 ఏళ్ల వయసులో కార్గిల్ యుద్ధంలోనే పోరాడుతూ అమరుడయ్యారు. ఆయన జీవిత కథతో సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'షేర్షా'. స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైంది. అయితే దేశభక్తి చిత్రంగా రూపొందిన 'షేర్షా' విజయం సాధించింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అదరకొట్టాడు. ఈ సినిమా చూసిన వైష్ణవ్ తేజ్ వెంటనే డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు.
ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో… ఆతర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాకి, ‘సంతోషం’ .. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల దర్శకుడు దశరథ్ కథను అందించడం విశేషం. అయితే ప్రస్తుతం అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత వైష్ణవ్ సినిమాను పట్టాలెక్కిస్తాడని అంటున్నారు.