సారాంశం

మెగాస్టార్ చిరంజీవి జోరు మీదున్నారు. ఆయన వరుస చిత్రాలు చేస్తున్నారు. మెగా 156 షూటింగ్ లో చిరంజీవి బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోయిన్ ని చిరంజీవి గా జంటగా  తెచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. 
 

మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు విడుదల చేశారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ నమోదు చేశారు. ఇటీవల విడుదలైన భోళా శంకర్ మాత్రం బోల్తా కొట్టింది. భోళా శంకర్ విడుదల తర్వాత అమెరికా వెకేషన్ కి వెళ్లిన చిరంజీవి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం చేస్తున్నారు. 

బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మెగా 156 ప్రకటించిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది. పంచభూతాలతో కూడిన మెగా 156 లోగో ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారని, ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడంటూ టాలీవుడ్ టాక్. 

ఈ చిత్ర హీరోయిన్స్ ని ఇంకా ప్రకటించలేదు. అయితే త్రిష ఈ చిత్రానికి సైన్ చేశారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ ఉన్న త్రిష ఈ ప్రాజెక్ట్ కి కరెక్ట్ అని యూనిట్ భావిస్తున్నారట. త్రిష కూడా పచ్చ జెండా ఊపారట. గతంలో త్రిష చిరంజీవికి జంటగా స్టాలిన్ మూవీ చేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో మరోసారి చిత్రం రానుంది. 

మెగా 156 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి వశిష్ట్ కి ఓటు వేశారు. 
 

అల్లు అరవింద్‌ సెటైర్లు ఆ డైరెక్టర్‌ని ఉద్దేశించేనా?.. రాజమౌళితో పోల్చుతూ రచ్చ