Mega 156: చిరంజీవి విలన్ గా రానా?
మెగా 156 నేడు గ్రాండ్ గా లాంచ్. చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో రానా విలన్ గా నటిస్తున్నదంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఈ ఏడాది చిరంజీవి మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. రవితేజ రోల్ ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో చిరంజీవి సందిగ్ధంలో పడ్డారు కూతురు సుస్మిత బ్యానర్లో చేయాల్సిన చిత్రం హోల్డ్ పెట్టారు.సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయాల్సింది.
ఈ ప్రాజెక్ట్ గురించి చిరంజీవి ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారు కూడా. ఇది బ్రో డాడీ రీమేక్ అని సమాచారం. భోళా శంకర్ సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా రీమేక్స్ చెయ్యొద్దు మొర్రో అంటూ చిరంజీవికి మొరపెట్టుకున్నారు. దాంతో చిరంజీవి కళ్యాణ్ కృష్ణకు హ్యాండ్ ఇచ్చాడు. తమిళ దర్శకుడు మిత్రన్ తో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట.
ఇక మెగా 157గా ప్రకటించిన వశిష్ట మూవీ మెగా 56అయ్యింది. నేడు గ్రాండ్ గా లాంచ్ చేశారు. చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందట. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతుంది. కాన్సెప్ట్ పోస్టర్ పంచ భూతాలైన గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశంలో రోపొందించారు.
ఈ క్రమంలో క్యాస్టింగ్ భారీగా ఉండనుందట. అనూహ్యంగా విలన్ గా దగ్గుబాటి రానా చేస్తున్నారంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. బాహుబలి సిరీస్లో మూవీలో రానా నెగిటివ్ రోల్ చేశారు. భీమ్లా నాయక్ లో కూడా విలన్ రోల్ చేశాడు. మరోసారి బాహుబలి తరహా పవర్ ఫుల్ విలన్ గా చేస్తున్నారట. ఈ పాత్రకు సూపర్ నాచురల్ పవర్ ఉండే అవకాశం కలదంటున్నారు. అలాగే భూలోకవాసి కూడా కాదట.
మరి రానా ఈ చిత్రానికి సైన్ చేస్తే పాన్ ఇండియా మార్కెట్ కి చాలా ప్లస్ అవుతుంది. మెగా 156 చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు.