మీటూ ఘాటు ఇప్పుడు మాములుగా లేదు. రోజుకో వివాదం నార్త్ సౌత్ అని తేడా లేకుండా చర్చనీయాంశంగా మారుతోంది. సీనియర్ నటుల నుండి ఇప్పుడున్న సినీ ప్రముఖుల్లో ఇంకా చాలా మంది పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్లు అనేక రకాల గాసిప్స్ సోషల్ మీడియానుషేక్ చేస్తున్నాయి. మొత్తానికి మీటూ ఉద్యమంతో చాలా వరకు కొత్తగా వచ్చే నటీమణులకు మంచి జరిగిందని చెప్పవచ్చు. 

ఈ విషయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవరకు కూడా ఉన్నారు. అసలు విషయంలోకి వస్తే.. సాధారణంగా కొత్తవారు అవకాశాల కోసం ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తీరుగుతూ ఉంటారు. అలాగే దర్శకుల ఆఫీస్ లకు వెళుతుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల వల్ల చాలా మంది దర్శకనిర్మాతలు కొత్తగా వచ్చే అమ్మాయిలను గెట్ లోకి కూడా రానివ్వడం లేదని తెలుస్తోంది. 

ఇంతకుముందు న్యూ కమ్మర్స్ తో ఫొటో షూట్ నిర్వహించే వారు. ఆల్బమ్స్ ఉంటె కూడా తీసుకునేవారు. మగవారు ఎంత మంది వచ్చినా ఎక్కువగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. తప్పదు అంటే ఆడిషన్స్ నిర్వహించినప్పుడు పేరెంట్స్ తప్పకుండా ఉండాలనే షరతుతో నటీమణులను సినిమా కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారట. 

ఒంటరిగా మాత్రం ఏ అమ్మాయిని కలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. 

నిజంగా ఇది ఒక మంచి పరిణామమే అని చెప్పాలి. కానీ కొందరైతే అసలు అవకాశం కోసం వచ్చే మహిళలను చూసి బయపడిపోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారో అని చాలా వరకు గెట్ లోకి అడుగుపెట్టనివ్వడం లేదనే రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.