#మీటూ ఘాటు ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చాలా మంది నటీమణులు వారికి ఎదురైనా చేదు అనుభవాలు మీడియా ముందు పెట్టేస్తున్నారు. వాటిలో ఎవరు ఎంతవరకు నిజం చెబుతున్నారు అనే విషయం పక్కనపెడితే మీటూ పై స్పందించినా స్పందించకపోయినా తలనొప్పిగా మారుతోంది. 

చాలా మంది సెలబ్రటీలు కొందరికి మద్దతు పలుకుతుంటే మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సపోర్ట్ చేస్తూ అంతా అబద్దమే అనేస్తున్నారు. ఇక ప్రెస్ మీట్ లు అంటేనే బాలీవుడ్ సెలబ్రెటీలు భయపడుతున్నారు. ఎక్కడ క్యాస్టింగ్ కౌచ్ అనే ప్రశ్న ఎదురవుతుందో అని హడలెత్తి పోతున్నారు. ఇకపోతే ఈ విషయం మాకెందుకులే అనుకోని సైలెంట్ గా వారి పని వారు చేసుకుంటున్న కూడా విమర్శలు తప్పడం లేదు. 

ఈ విషయంకు కరణ్ జోహార్ చాలా దూరంగా ఉండడం చూసి కాంట్రవర్షియల్ సుందరి కంగనా తట్టుకోలేకపోతోంది. అసలు ఆయన #మీటూ పై ఎందుకు స్పందించడం లేదని అంటోంది. సోషల్ మీడియాలో గంటకో ఫోటో పోస్ట్ చేసే ఈ బాలీవుడ్ ప్రముఖుడు కన్నతల్లి లాంటి ఇండస్ట్రీలో అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది. అలాగే షబానా ఆజ్మీపై కూడా ఇదే విధంగా ఫైర్ అయ్యింది కంగాన. 

దీంతో బాలీవుడ్ లో లేని పోనీ తలనొప్పులు మనకెందుకులే అని సైలెంట్ గా ఉన్న విమర్శలు తప్పడం లేదని మీడియాలో కథనాలు వెలువతున్నాయి. అయితే కంగనా చేసిన కామెంట్స్ కు కరణ్ ఎలాంటి సమాధానం ఇస్తాడనేది బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.