Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 15వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో మీరా ప్రకాష్ ముఖం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపుతుంది. నిజం చెప్పురా ఏం జరిగింది. రాత్రి తాగి ఏదోదో వాగినావు అనడంతో ప్రకాష్ షాక్ అవుతాడు. ఏం చెప్పాను అత్త అని అనగా తాగినప్పుడు అసలు గుర్తుకు ఉండదా అని మీద రాత్రి ప్రకాష్ చెప్పిన విషయాలు అని చెప్పడంతో ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మల్లీ కి అన్యాయం జరిగింది చెప్పు నాకు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తావు కదరా అని ప్రకాష్ ని గట్టిగా నిలదీస్తుంది మీరా. అదేం లేదు అత్త.. రాత్రి నేను ఏదో తాగి వాగాను.. దాన్ని నువ్వు పట్టించుకోకు అనగా నిజం చెప్పు ప్రకాష్ నువ్వు చెప్పేది నిజమైతే నా అన్యాయం అవుతుంది అని అంటుంది మీరా.
అప్పుడు ప్రకాష్ మీరాకి అబద్ధాలు చెబుతూ అదేం లేదు అత్త మల్లీ నిన్ను అరవింద్ బాబు ఇద్దరు సంతోషంగా ఉన్నారు అని మీరాకి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అప్పుడు లేదు నాన్న దగ్గర అయితే నిజం చేస్తున్నావో చెప్పరా అని గట్టిగా అరుస్తుంది మీరా. నా దగ్గర ఏందో దాస్తున్నాడు అయిన వీడిని అడిగేదేంటి డైరెక్ట్ గా అల్లుడు గారిని అడుగుతాను అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరొకవైపు అరవింద్ మల్లీ, మాలిని గురించి ఆలోచించుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మాలిని ఈ మధ్య మన మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది అనిపిస్తోంది సాయంత్రం క్లాసు లేదు కొంచెం తొందరగా వస్తావా అరవింద్ మూవీ కి వెళ్దాం అని అంటుంది మాలిని.
తర్వాత మాలినికి దగ్గు రావడంతో కారు పక్కకు ఆపి వాటర్ బాటిల్ కోసం షాప్ దగ్గరికి వెళ్తాడు అరవింద్. అప్పుడు అరవింద్ మొబైల్ కి మీరా ఫోన్ చేస్తుంది. అప్పుడు మల్లీ ఫోన్ లిఫ్ట్ చేయగా ఒకసారి అరవింద్ బాబుకి ఇస్తారా అని అనగా పర్లేదు చెప్పండి అనడంతో ఇది మా కుంటుంబంకి సంబంధించిన విషయం అని అంటుంది మీరా. అప్పుడు మాలిని నేనేం ఆయనకు పరాయిదాన్ని కాదు ఆయన భార్యని అని అనడంతో మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మీరా అప్పుడు రాత్రి ప్రకాష్ అన్న మాటలు గుర్తుతెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అప్పుడు మీరా ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మాలిని అరవింద్ లి నెంబర్ కనిపించకూడదు అని నెంబర్ డిలీట్ చేస్తుంది. మరోవైపు మీరా మాలిని అరవింద్ బాబు గారి భార్య నా అనుకుంటూ ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు గతంలో జరిగిన విషయాలు అన్నీ తలుచుకుని రోడ్డుపై పరిద్యానంతో నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది మీరా. మీరా వాళ్ళ అమ్మ,సోదమ్మ చెప్పిన మాటలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ తలుచుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మీరా.
నా బతుకు మాది నా బిడ్డ బతుకు అవ్వకూడదు నా బిడ్డ బతుకు బాగుండాలా అని మీరా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మీరా అమ్మవారి దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా బతుకు ఎప్పుడు ఆగం అయిపోయినది ఇప్పుడు నా కూతురు జీవితం కూడా పాడైపోతుంది అంటూ బాధపడుతూ ఉంటుంది మీరా. అప్పుడు మీరా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనందంతో ప్రకాష్ వస్తాడు. ఇప్పుడు ఏంటి అత్త ఏం కోరుకుంటున్నావు అనడంతో కోపంతో రగిలిపోతున్న మీరా ప్రకాష్ చెంప చెల్లుమనిపిస్తుంది.
నా బిడ్డ జీవితంతో దేవుడే ఆడుకుంటున్నారు అనుకుంటే మీరు సొంతవాళ్లు మీరు కూడా ఆడుకుంటున్నారా అని అంటుంది. నా కూతురు గురించి అన్ని అబద్ధాలు చెప్పావు అనడంతో ప్రకాష్ షాక్ అవుతాడు. అప్పుడు ప్రకాష్ కలర్ పట్టుకొని నా బిడ్డ అక్కడ బాధ పడుతుందని నీకు ముందే తెలుసు కదా తెలిసి కూడా నాకు చెప్పలేదు అని నిలదీస్తుంది. చెప్పరా అని నిలదీస్తూ ఎమోషనల్ అవుతుంది మీరా. అప్పుడు ప్రకాష్ జరిగింది మొత్తం వివరించగా మీరా షాక్ అవుతుంది.
మల్లీ చెప్పొద్దు అని మాట తీసుకుంది అత్త అనడంతో నా కాకుండా ఎవరికి చెప్పొద్దని చెప్పింది అని ఏడుస్తుంది మీరా. అప్పుడు మీరా కోపంతో రగిలిపోద్ది ఎవరు ఏం చెప్పొద్దు నేను చేయాల్సింది చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఎలా అయిన మల్లీ ఇబ్బంది పెట్టాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు.
