సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో మహేష్  సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే ‘దూకుడు’ సినిమాలో ఈ దూకుడు అంటూ ఆడి పాడిన భామ మీనాక్షి దీక్షిత్.. ఈ  చిత్రంలో నటిస్తోందని రివీల్ అయ్యింది. ఈ నేపధ్యంలో  మీనాక్షి పాత్ర ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాలో న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో మీనాక్షి కనిపించబోతోంది.  ఈ పాత్ర ఫుల్‌ గ్లామరస్‌గా ఉంటుందట. ఫస్టాఫ్ లో ఈ పాత్ర ఉంటుంది. అంటే మహేష్ క్యారక్టర్ ఇండియాకు వచ్చేదాకా ఈ క్యారక్టర్ మనను ఎంగేజ్ చేస్తుందన్నమాట. 

మహేష్ కు గర్ల్ ఫ్రెండ్ గా కనపడే ఈ పాత్ర సెకండాఫ్ లోనూ కొద్ది సేపు అలా వచ్చి వెళ్లిపోతుందని అంటున్నారు. అయితే ఫస్టాఫ్ లో మహేష్ తో పాట లో ఉంటుందని చెప్తున్నారు. వీళ్లిద్దరి మద్య వచ్చే రొమాంటిక్ సీన్స్ హెలట్ అని చెప్తున్నారు.  ఇక ఈ సినిమా కోసం మీనాక్షి తన లుక్‌ని టోటల్‌గా మార్చుకుంది. పూజ హెడ్గే పాత్ర లవర్ అని, ఆమెతో మహేష్ ప్రేమలో పడతారని చెప్తున్నారు. 

మీనాక్షి మాట్లాడుతూ..‘‘వంశీగారు నాకోసం ఓ ఆసక్తికరమైన పాత్రను రాశారు. మహేశ్‌బాబుగారికి, నాకు ఉండే కెమిస్ట్రీ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది’’ అని తన పాత్ర గురించి పేర్కొన్నారు మీనాక్షి. ‘మహర్షి’ చిత్రం మే 9న  విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తొలి పాటను ఈ 29న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో మహేశ్‌బాబు.. కాలేజ్ స్టూడెంట్‌గానూ, కార్పొరేట్ సంస్థకు సీఈవోగాను కనిపించనున్నారు. గ్రామంలోని రైతు సమస్యలను పరిష్కరించడమే ఈ చిత్ర కథాంశం.  దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నటుడు అల్లరి నరేశ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.