ఎనభై,తొంభైలలో తెలుగు స్టార్ హీరోయిన్స్ లో మీనా ఒకరు. అప్పట్లో మీనా దాదాపు అందరు సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది.  వారిలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో చేస్తూనే తమిళ్, కన్నడ సినిమాల్లో నటించి అలరించింది. 

అయితే వివాహానంతరం కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా.. రీఎంట్రీ ఇచ్చింది. దృశ్యం వంటి సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నత్తే సినిమాలో నటిస్తున్నఆమె....  దృశ్యం 2 సినిమాలో వెంకటేష్ సరసన కనిపించనుంది. అదే ఊపులో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో మీనా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 

అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా కమిటయ్యాడు బాలయ్య. దాంతో ఈ సినిమా గురించి రోజుకొక వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ క్రమంలో మరో వార్త ఇప్పుడు మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా మీనా నటిస్తున్నారని టాక్. ఈ సినిమాలోని బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడుస్తుందట. అప్పుడు ఆయన భార్య పాత్రలో మీనా కనిపించనుందని చెబుతున్నారు. బాలయ్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు. 

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనాతో బ్రేక్ వచ్చింది. రీసెంట్ గా చిత్రం టీజర్ రిలీజైతే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.