రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదటిసారి తన ప్రొడక్షన్ హౌస్ లో డిఫరెంట్ సినిమాను నిర్మించేందుకు సిద్దమయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో కథానాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక చిన్న ఎనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. 

మీకు తప్ప ఎవ్వరికి చెప్పను అని టైటిల్ సెట్ చేసిన ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ ని కూడా రౌడీ గ్యాంగ్ రిలీజ్ చేసింది. ఒక స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే లుక్ లో సెట్ చేసిన పోస్టర్ సరికొత్తగా ఉంది. ఇక మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ అనే ట్యాగ్ తో తరుణ్ భాస్కర్ అలాగే మరోప్ ఇద్దరు కమెడియన్స్ మొబైల్స్ తో ఆశ్చర్యంగా ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే సినిమాలో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని ఊహించవచ్చు. 

ఇక సినిమా ద్వారా శమ్మిర్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమా కాన్సెప్ట్ ను నమ్మి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో విజయ్ దేవరకొండ సొంత బడ్జెట్ లో సినిమాను నిర్మిస్తున్నాడు. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.