అక్కినేని అఖిల్ న‌టించిన మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను రిలీజ్ కు సిద్దపడుతోంది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రానికి .... బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. రీసెంట్ గా  ఈ సినిమా ట్రైల‌ర్ ని   లాంచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి.

అయితే హఠాత్తుగా ఊహించని విధంగా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ మొదలైంది. తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తదుపరి చిత్రం కావటంతో ట్రేడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సెన్సార్ పూర్తైన క్షణం నుంచి ఈ చిత్రం సెకండాఫ్ బాగోలేదంటూ, అఖిల్ కు మరో ప్లాఫ్ తప్పదని ప్రచారం స్టార్టైంది.   ఫస్టాఫ్ సరదాగా నడిచిన ఈ చిత్రం సెకండాఫ్ లో కన్ఫూజ్ అయ్యిపోయిందని అంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఎలా ఉన్నా..ఇలాంటి టాక్ వల్ల ఓపినింగ్స్ కు ఇబ్బందిగా మారతాయి. అఖిల్ కు యాంటి ఫ్యాన్స్ కూడా పెద్దగా లేరు. మరి ఎవరు ఈ టాక్ ని మొదలెట్టారో అర్దం కానట్లుగా ఉంది.

అసలే అఖిల్ కెరీర్ రెండు సినిమాలు నిరాశపరచటంతో అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడీ టాక్ ని సోషల్ మీడియాలోనూ వైరల్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే సినిమా చూడకుండా, కథేంటో తెలియకుండా   ఎలా సినిమా ఫేట్ ని డిసైడ్ చేయగలుతారు. ఈ సినిమాకు నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు ఎలా అస్సెట్ కానున్నాయి. ఇక  డైరక్టర్  ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరిగా తీర్చిదిద్దాడు? అఖిల్ ఎలా నటించాడు... అన్న‌దానిని బ‌ట్టే హిట్ స్దాయి ఆధార‌ప‌డి ఉంటుంది.  

ఇక  కంటెంట్ పరంగా రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా గుర్తుకు వస్తోందని, ప్రేమ దాకా ఓకే పెళ్లి అంటే కష్టం అంటూ కమిట్మెంట్ దూరంగా ఉండే పాత్రను అఖిల్ చేస్తున్నాడని అంటున్నారు.  ఈ మ‌జ్ను క‌థేంటో ఈనెల 25న తెలుస్తుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. అప్పటిదాకా టాక్ లని లైట్ తీసుకోవటం బెస్ట్.