‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ కలిసి చేస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’.  ఈ మూవీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. 

 విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కాంబినేషన్ లో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) ప్రతిష్టాత్మకంగా భావించి భారీగానే నిర్మించాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ నేఫద్యంలో ఈ చిత్రం మీడియావారికి ముందు రోజు ఏప్రియల్ 4న ప్రీమియర్ షో చూపించబోతున్నారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. 

అయితే ఈ ప్రీమియర్ షో ని కేవలం మీడియా షో గా కాకుండా మీడియా ఫ్యామిలీ షోగా మార్చాలనుకున్నారు దిల్ రాజు. ఈ సినిమాని మీడియా కు చెందిన ఫ్యామిలీస్ తో కలిసి చూడబోతున్నారు. తమ సినిమాలో ఉన్న ఫ్యామిలీ టచ్ ని ఇలా ప్రమోషన్స్ విషయంలోనూ దిల్ రాజు ప్లాన్ చేయటం చాలా మందికి ఆనందం కలిగిస్తోంది. ఇది ఒక గెట్ టుదెగర్ గా టీమ్ అంటోంది. ఇలా మొత్తానికి ఫ్యామిలీలతో కలిసి ఈ సినిమా ని చూడాలని నిర్మాత భావిస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ గత సినిమాల్లో లైగర్ తో బాలీవుడ్ కి వెళ్లినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఖుషి సినిమాని మాత్రం కేవలం తెలుగు, తమిళ్ లోనే రిలీజ్ చేసారు. ఇపుడు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల అందరు హీరోలు పాన్ ఇండియా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో తమ హీరో కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ అండ్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంది. తాజాగా ఇప్పుడు ట్రైలర్ ని తీసుకు వచ్చారు. ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. మధ్యతరగతికి చెందిన హీరో.. తన ఫ్యామిలీ ఎమోషన్స్‌ని, బాధ్యతలను, అలాగే ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్ళాడు అనే విషయాలను పరుశురాం మార్క్ ఎంటర్టైనింగా చూపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే గీతగోవిందంతో పోలిస్తే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది.

తాజాగా సెన్సార్‌ పూర్తయ్యింది. ఈ మూవీ రెండు గంటల నలభై నిమిషాల నిడివి ఉందట. అంతేకాదు సినిమాలోని ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్లని రివీల్‌ చేశాడు నిర్మాత దిల్‌రాజు. సినిమాకి యు బై ఏ సర్టిఫికేట్‌ వచ్చిందట. నాలుగు ఫైట్స్ ఉన్నందన యూ బై ఏ వచ్చినట్టు తెలిపారు. అవి పక్కన పెడితే క్లీన్‌ ఫ్యామిలీ మూవీ అని చెప్పారు.