మిడిల్ క్లాస్ అబ్బాయి కోట్లు లాగేశాడు! షాకింగ్ వసూళ్లు

First Published 2, Jan 2018, 10:45 AM IST
mca with huge box office collections
Highlights
  • నాని హీరోగా వచ్చిన ఎంసీఏ
  • ఏడాది చివర్లో ఎంసీఏ హిట్ తో నానికి మరో విజయం
  • నాని, సాయి పల్లవి, భూమిక, దిల్ రాజు, వేణు శ్రీరాం కాంబినేషన్ లో ఎంసీఏ

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని మరోసారి మిడిల్ క్లాస్ అబ్బాయ్ తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఎంసీఏతో వసూళ్ల పంట పండించాడు. ఇటు లోకల్ గా అటు నాన్ లోకల్ గా అమెరికాలోనూ ఎంసీఏ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్కును రీచ్ అయినట్టుగా తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మిక్డ్స్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఎంసీఏ దూసుకుపోతోంది.

ఈ సినిమా మొత్తంగా ముప్పై కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటేసినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, రెస్టాఫ్ ఇండియాలో, ఓవర్సీస్ లో కలుపుకుని ముప్పై కోట్ల రూపాయల వసూళ్లను సాధించాడట మిడిల్ క్లాస్ అబ్బాయి.

ఈ సినిమా బడ్జెట్ తో పోల్చుకున్నా.. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం చూసుకున్నా.. ముప్పై కోట్ల రూపాయల వసూళ్ల ద్వారా ఎంసీఏ కమర్షియల్ గా హిట్టయినట్టే లెక్క. గత ఏడాది చివరగా విడుదల అయిన సినిమాల్లో ఒకటైన ఎంసీఏ విజయంతో ఏడాదిని ముగించినట్టే. అయితే ఈ సినిమాకు ఇంకా వసూళ్లకు కొంత స్కోప్ ఉంది. సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలు ఏవీ బరిలోకి రాకపోవడంతో.. న్యూ ఇయర్ హాలిడే కలెక్షన్లను కూడా ఎంసీఏ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

loader