ఎంసీఏ హలో వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్

First Published 25, Dec 2017, 5:26 PM IST
mca hello weekend collections report
Highlights
  • ఎంసీఏ హలో వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్
  • కథ, హీరో,హీరోయిన్ అన్ని బలాలతో ముందంజలో ఎంసీఏ
  • స్టోరీ రొటీన్ దే అయినా అఖిల్ కొత్తదనంతో వచ్చి సక్సెస్

గత వారం విడుదలైన రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని మరో సారి ఎంసీఏతో కూల్ విక్టరీ అందుకున్నాడు. ఇక రీలాంచ్ మూవీ అంటూ వచ్చిన అఖిల్ హలో కూడా రివ్యూలు పాజిటివ్ గా రావటంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు సాధిస్తోంది.

 

గత గురువారమే విడుదల అయ్యి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ వసూళ్లకు అవకాశాన్ని ఏర్పరుచుకుంది ఎమ్‌సీఏ, ఇక శుక్రవారం విడుదలై.. మూడు రోజుల పాటు ఊపు చూపించింది హలో. ఈ రెండు సినిమాలూ ఇండస్ట్రీని రెండు నెలల స్లంప్ నుంచి కొంత బయటపడేశాయి. నవంబర్, డిసెంబర్లలో విడుదల అయిన సినిమాల్లో ఒక్క ‘పీఎస్‌వీ గరుడవేగ’ తప్ప మిగతావన్నీ ఫెయిల్యూర్స్ గానే నిలిచిన నేపథ్యంలో.. ఏడాది ఆఖర్లో వచ్చి పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు సంపాదించుకుంటున్నాయి ఈ రెండు సినిమాలు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటికి.. ఎమ్‌సీఏ, హలో సినిమాల వసూళ్ల లెక్కలు ఇలా ఉన్నాయి.

 

ఎమ్‌సీఏ 18 కోట్ల రూపాయల షేర్ ను సాధించినట్టుగా తెలుస్తోంది. నెల్లూరులో 0.56 కోట్లు, గుంటూరులో 1.29 కోట్లు, కృష్ణా లో 1.16 కోట్లు, వెస్ట్ గోదావరి 1.02 కోట్లు, ఈస్ట్ 1.20 కోట్లు, వైజాగ్ లో 2.31 కోట్లు, సీడెడ్ 2.60 కోట్లు, నైజాం 7.52 కోట్ల రూపాయలను వసూలు చేశాడట మిడిల్ క్లాస్ అబ్బాయి.హలో నైజాంలో 2.31 కోట్లు, సీడెడ్ లో 1.23 కోట్లు, వైజాగ్ లో 0.81కోట్లు, ఈస్ట్ 0.43 కోట్లు, వెస్ట్ 0.31 కోట్లు, కృష్ణా 0.54 కోట్లు, గుంటూరు 0.73కోట్లు, నెల్లూరు 0.30 కోట్లు, మొత్తం 7.66 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది ఈ సినిమా అని చెబుతున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.

loader