సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా చాలా వ్యాపారాలు చేస్తుంటాడు. యాడ్స్, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, మల్టీప్లెక్స్ లో పెట్టుబడులు ఇలా చాలా చేస్తుంటాడు. వీటితో పాటు సినిమాల నిర్మాణ రంగంలో కూడా సత్తా చాటాలని ఎంబి అనే బ్యానర్ ను  స్థాపించాడు.

అయితే ఇప్పుడు ఈ బ్యానర్ పై వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలా అని భారీ బడ్జెట్ సినిమాలు కాదు.. ఈ బ్యానర్ కి సంబంధించిన వ్యవహారాలు మహేష్ భార్య నమ్రత చూసుకుంటుందనే సంగతి తెలిసిందే.

ఆమె ఇప్పుడు మంచి కథలు, ప్రామిసింగ్ డైరెక్టర్ల కోసం చూస్తోందట. రెండు, మూడు కోట్ల బడ్జెట్ లో మంచి సినిమాలు తీయగలిగే దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తుందట. ఈ మధ్య కాలంలో చిన్న బడ్జెట్ లో వచ్చిన చాలా సినిమాలు ఘన విజయాలను నమోదు చేశాయి. 'ఆర్ ఎక్స్ 100','చిలసౌ' వంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి.

గీతాఆర్ట్స్, యువి, మైత్రి లాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా చిన్న సినిమాలపై దృష్టి పెట్టాయి. అదే విధంగా ఎంబి బ్యానర్ పై కూడా సినిమాలు తీయాలని ఆలోచిస్తున్నారు. మరి నమ్రత ఆలోచన మహేష్ బాబుకి ఎంతవరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి!