సినిమాలు..అందుకు సంభందించిన పబ్లిసిటీ మెటీరియల్ బయిటకు వదిలేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్దితి. జనం చాలా ఎలర్ట్ గా ఉంటున్నారు. గతంలోలాగ చూసి చూడనట్లు వెళ్లిపోవటం లేదు. చేతిలో ఉన్న సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అవసరమైతే రోడ్డు ఎక్కి తమ నిరసన తెలుపుతున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యే...మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కు ఎదురైంది. 

వివరాల్లోకి వెళితే... టాలీవుడ్‌లోని పాపుల‌ర్ నిర్మాణ సంస్థ‌ల్లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఒక‌టి. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే స్వ‌రూప్ ఆర్ఎస్‌జె డైరెక్ష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 8ను ఆ సంస్థ ప్ర‌క‌టించింది. 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన స్వ‌రూప్ త‌న డెబ్యూ ఫిల్మ్‌తోటే ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డంతో పాటు, అటు మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌నూ సాధించారు.

స్వ‌రూప్ ఆర్ఎస్‌జె డైరెక్ష‌న్‌లో నిర్మిస్తోన్న చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ‌నివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో యంగ్ డైరెక్ట‌ర్స్ పాల్గొన్నారు. స్వ‌రూప్‌కు అన్వేష్ రెడ్డి, రాహుల్ యాద‌వ్ సంయుక్తంగా సినిమా స్క్రిప్టును అంద‌జేశారు. 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ వెంక‌టేష్ మ‌హా క్లాప్ నివ్వ‌గా, 'క‌ల‌ర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి 'డియ‌ర్ కామ్రేడ్' ఫేమ్ భ‌ర‌త్ క‌మ్మ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా టైటిల్ లోగోతో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ చిత్రానికి 'మిశ‌‌న్ ఇంపాజిబుల్' అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ‌ఆ పోస్ట‌ర్‌లో హ‌నుమంతుడు, శివుడు, శ్రీ‌కృష్ణుని వేష‌ధార‌ణ‌లో ఉన్న ముగ్గురు పిల్ల‌ల చేతుల్లో గ‌న్స్ ఉన్నాయి. ఐతే, ఈ పోస్టర్ పై వివాదం రేగింది.

హిందూ దేవుళ్ళ చేతిలో గన్స్ పెడతారా అని కొన్ని సంఘాలు అభ్యంతరం తెలపడంతో పోస్టర్ ని వాపస్ తీసుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమించండి అని పేర్కొంది.

తిరుప‌తి స‌మీపంలోని ఓ గ్రామంలో నిధి అన్వేష‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్న ముగ్గురు పిల్ల‌లతో పాటు, మ‌రో రెండు ముఖ్య పాత్ర‌లు ఈ సినిమాలో ఉంటాయి. త్వ‌ర‌లో హీరో హీరోయిన్ల‌ను  ప్ర‌క‌టించ‌నున్నారు.

నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.ఎమ్‌. పాషా అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. మార్క్ కె. రాబిన్ సంగ‌తం స‌మ‌కూరుస్తుండ‌గా, దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: స‌్వ‌రూప్ ఆర్ఎస్‌జె
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: ఎన్‌.ఎమ్‌. పాషా
బ్యాన‌ర్‌: మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
సినిమాటోగ్ర‌ఫీ: దీప‌క్ య‌ర‌గ‌ర‌
మ్యూజిక్: మార్క్ కె. రాబిన్‌
ఎడిటింగ్‌: ర‌వితేజ గుర‌జాల‌
ఆర్ట్‌: నాగేంద్ర‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌