విజయ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రవితేజ, మాస్ మహారాజ్ జోరు మూమూలుగా లేదు..
యమా జోరు చూపిస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ ఏమాత్రం తగ్గడంలేదు. ఈసారి ఎలాగైనాసాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు. పాన్ ఇండియా ప్రమోషన్లలో ఊపు ఊపేస్తున్నాడు మాస్ మహారాజ్.

మాస్ మహారాజ రవితేజ మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు రవితేజ. ఈసినిమా తో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్తున్నాడు రవి. ఎలాగైనా ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నాడు. స్టువర్టుపురం గజదొంగగా పేరున్న టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కింది. ఇండియన్ రాబిడ్ హుడ్‌గా టైగర్ నాగేశ్వరరావు కు పేరుంది. ఆయన జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70స్ లో ఓ 20 ఏళ్ళ పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి.. పెద్ద ఎత్తున దొంగతనాలు చేశాడు అటువంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని.. మరో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు చూసు ఆ అంచనాలు ఇంకా పెంచేసుకున్నారు ప్రేక్షకులు. దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవల్లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో తెగ బిజీగా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా రవితేజ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.
అయితే ఈసారి పాన్ ఇండియా ప్రమోషన్లు కావడంతో.. రవితేజ అంతట సందడి చేస్తూ వస్తున్నాడు. కాగా తాజాగా హిందీ ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవితేజ అక్కడ స్టేజీపై మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తూ.. కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.