టైగర్ నాగేశ్వరావు షూటింగ్ లో గాయపట్ట రవితేజ, షాకింగ్ విషయం వెల్లడించిన నిర్మాత
మాస్ మహారాజ్ రవితేజ సినిమా కోసం ఎంత అయినా కష్టపడతాడు.. ఎంత రిస్క్ చేయడానికైనా వెనుకాడడు. ఈ విషయం అందరికి తెలిసిందే.. కాని అది మరోసారి నిరూపితం అయ్యింది. టైగర్ నాగేశ్వర్ రావు కోసం రవితేజ చేసిన రిస్క్ గురించి తాజాగా నిర్మాత వెల్లడించారు.

మాస్ మహారాజ్ రవితేజ సినిమా కోసం ఎంత అయినా కష్టపడతాడు.. ఎంత రిస్క్ చేయడానికైనా వెనుకాడడు. ఈ విషయం అందరికి తెలిసిందే.. కాని అది మరోసారి నిరూపితం అయ్యింది. టైగర్ నాగేశ్వర్ రావు కోసం రవితేజ చేసిన రిస్క్ గురించి తాజాగా నిర్మాత వెల్లడించారు.
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ (Raviteja)హీరోగా.. దర్శకుడు వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao). అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఆంధ్రాలోని స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆదారంగా ఈసినిమా తెరకెక్కుతోంది ఇవన్నీ సినిమాపై అంచనాలను నెలకొల్పాయి. ఇక ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈనెల 20 సినిమా రిలీజ్ అవుతుండటంతో.. మూవీ ప్రమోషన్లకు పదును పెట్టారు టీమ్. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో రవితేజ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. రవితేజ సినిమాలో ట్రైన్ దోపిడీ సీన్ చేస్తుప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో అదుపు తప్పి కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన బాగా దెబ్బ తగిలింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు. ఆ షాట్ లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. షూట్ ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాతకు నష్టం అని ఆలోచించి రెండు రోజుల్లో మళ్ళీ షూట్ కి వచ్చారు. పూర్తిగా నయమయ్యేదాకా రెస్ట్ తీసుకోమని నేను, డైరెక్టర్ చెప్పినా బడ్జెట్ పెరిగిపోతుందని షూట్ కి వచ్చేశారు. సినిమాపై ఆయనకు అంత డెడికేషన్ ఉంది అని అన్నారు.
ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఈ దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ చాలా దగ్గరలో ఉండటంతో.. ఈమూవీ ప్రమోషన్స్ ను పాన్ఇండియా రేంజ్ లో అట్టహాసంగా నిర్విహిస్తున్నారు మూవీ టీమ్. ఇక మరో విశేషం ఏంటంటే.. రవితేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయడం, అది కూడా ఆయన ఫస్ట్ టైమ్ పాన్ఇండియాకు వెళ్ళడం.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం తో సనిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. పైగా ఈమూవీ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కనుండటం బాగా హైలెట్ అవుతోంది.